KTR : ‘KCR ఏం చేశారు..’ అనే ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం
- Author : Sudheer
Date : 01-04-2024 - 10:59 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార పార్టీ – ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇరు పార్టీల నేతలు ఎక్కడ తగ్గేదెలా అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు , సవాళ్లు చేసుకుంటున్నారు. తమ పార్టీ నేతలంతా వారి పార్టీలోకి తీసుకెళ్తుందని ఆగ్రహం తో ఉన్న బిఆర్ఎస్..నిన్న కేసీఆర్ (KCR) ఎండిన పంటల పరిశీలన కోసం మూడు జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భాంగా కాంగ్రెస్ వంద రోజుల పాలనతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో కాంగ్రెస్ శ్రేణులు పదేళ్ల కేసీఆర్ ఏంచేశారంటూ ప్రశ్నలు కురిపిస్తున్న వేళ..బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ (KTR)..వారి ప్రశ్నలకు సమాదానాలు తెలిపారు. ట్విట్టర్ వేదికంగా పదేళ్లలో కేసీఆర్ సాధించిన విజయాలు, రాష్ట్రానికి చేసిన ప్రగతి గురించి వివరించారు. చెరిపేస్తే చెరగని సత్యం కేసీఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని, తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమంగా ఉందన్నారు. రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. ఈ ట్వీట్‌కు ఆయా రాష్ట్రాల పర్ క్యాపిటాకు సంబంధించిన ఫోటోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జత చేశారు.
₹ 3.09 లక్షల తలసరి ఆదాయం తో పెద్ద రాష్ట్రాల లో దేశం లోనే తెలంగాణ No -1.
అయినా ఏమి చెసినవ్ కేసిఆర్ అని మీడియా, ప్రతిపక్షాలు అంటాయి..
చేరిపెస్తే చెరగని సత్యం కేసిఆర్ గారు సాధించిన ఆర్థిక ప్రగతి.
జై తెలంగాణ! pic.twitter.com/JkIqzxqyMM
— KTR (@KTRBRS) April 1, 2024
Read Also : Nizamsagar : నిజాంసాగర్ కెనాల్‌కు గండి..ఇళ్లలో నుండి పరుగులుపెట్టిన ప్రజలు