Nizamsagar : నిజాంసాగర్ కెనాల్‌కు గండి..ఇళ్లలో నుండి పరుగులుపెట్టిన ప్రజలు
నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్మూర్ ప్రాంతంలోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు
- By Sudheer Published Date - 10:49 AM, Mon - 1 April 24

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో నిజాంసాగర్ కెనాల్ (Nizamsagar Canal)కు గండి పడడం(Embankment Broken)తో చాల కాలనీలోకి నీరు చేరడం తో వారంతా తమ ఇళ్లను వదిలి బయటకు పరుగులుపెట్టారు. ఈ ఘటన సోమవారంఉదయం చోటుచేసుకుంది. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని జర్నలిస్ట్ కాలనీకి ఆనుకొని ఉన్న నిజాంసాగర్ కెనాల్ కట్టకు ఓ చోట గండి పడింది. దీంతో కాలనీలోని ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరడం తో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యమే కారణంగానే ఈ ఘటన జరిగింది అంటూ స్థానికుల ఆరోపణ చేస్తున్నారు. త్వరగా సహాయక చర్యలు మొదలు పెట్టాలని కాలనీవాసుల డిమాండ్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా చెరువులకు నీటిని వదిలే సమయంలో.. నీటిపారుదల అధికారులు కాలువను శుభ్రం చేయాల్సి ఉంటుంది. అయితే ఆర్మూర్ ప్రాంతంలోని అధికారులు అవేవీ పట్టించుకోలేదు. దీంతో ప్రధాన కాలువ మురికి కూపంలో తయారై చెత్తా చెదారంతో నిండిపోయింది. కాగా, ప్రజలకు తాగురు, రైతులకు సాగునీటి కోసం ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీటిని వదిలారు. నిర్వహణ సరిగా లేకపోవడంతో కాలువ తెగిపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : Venu Swamy: ఇదేందయ్యా ఇది.. భార్యతో కలిసి రీల్స్ చేసిన వేణు స్వామి?