Ward Office System: గ్రేటర్ లో వార్డు కార్యాలయ వ్యవస్థ ప్రారంభం
నగర పరిపాలనా సంస్కరణల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది గ్రేటర్ హైదరాబాద్. ఈ రోజు శుక్రవారం కాచిగూడలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రారంభించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు
- By Praveen Aluthuru Published Date - 01:28 PM, Fri - 16 June 23

Ward Office System: నగర పరిపాలనా సంస్కరణల్లో అనేక మార్పులు తీసుకొస్తుంది గ్రేటర్ హైదరాబాద్. ఈ రోజు శుక్రవారం కాచిగూడలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రారంభించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
కేటీఆర్ మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయ వ్యవస్థ నగర ప్రజలు, కార్పొరేషన్ పాలనపైనా సానుకూల ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వార్డు కార్యాలయాలకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు నేతృత్వం వహిస్తారు, వివిధ విభాగాలను పర్యవేక్షించే బాధ్యత వారిపై ఉంటుంది. రోడ్ల నిర్వహణ, పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక, విద్యుత్, నీటి సరఫరా వంటి విభాగాలకు చెందిన పది మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం ఈ కార్యాలయాల నుంచి పని చేస్తుంది. భవిష్యత్తులో అదనంగా వార్డు కార్యాలయాలకు హెల్త్ మరియు పోలీసు అదనపు అధికారులను అటాచ్ చేసే ప్రణాళికలు ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
Telangana Scripts a New Chapter in Urban Administration.
On Telangana Pattana Pragathi Day, MA&UD Minister @KTRBRS launched @GHMCOnline's Ward Office system by inaugurating a Ward Office in Kachiguda.
Facilitating decentralisation and people-centric governance, each of the… pic.twitter.com/X3MkHiqBzM
— KTR, Former Minister (@MinisterKTR) June 16, 2023
వార్డు కార్యాలయ వ్యవస్థ ద్వారా ప్రజలు తమ సమస్యలకు సత్వర పరిష్కారాలను పొందవచ్చని అన్నారు కేటీఆర్ అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతుందని, ఇలాంటి కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ప్రజా ప్రతినిధులందరూ కలిసి పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు కార్యాలయాలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.
Read More: Adipurush Review: మోడ్రన్ రామాయణం.. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ ఎలా ఉందంటే!