KTR : మీ ఇద్దరిలో సన్నాసి ఎవరు..? – కేటీఆర్ ట్వీట్
గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులు తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారు
- By Sudheer Published Date - 08:39 PM, Thu - 11 July 24

నిరుద్యోగుల (Unemployed ) ఫై చేయి చేసుకున్న వారిని వదిలిపెట్టం..అధికారం అనేది ఎప్పుడు ఒక్కరి చేతిలోనే ఉండదు..ఈరోజు మీది కావొచ్చు..మాకు ఓ రోజు వస్తాది..వడ్డీతో కలిపి తీర్చుకుంటాం, విద్యార్ధులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాందీ (Rahul Gandhi) సన్నాసా? లేక రేవంత్ రెడ్డి (Revanth Reddy) సన్నాసా? చెప్పాలంటూ.. అంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులు తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ..ధర్నాలు చేస్తున్న నిరుద్యోగుల ఫై పోలీసుల చేత లాఠీఛార్జ్ చేయించడం , కేసులు పెట్టడం, జైలు కు తరలించడం వంటివి చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులఫై పోలీసుల దాడిలో పలువురు గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని పరామర్శించిన కేటీఆర్..రేవంత్ రెడ్డి ఫై నిప్పులు చెరిగారు. మెగా డీఎస్సీ (Mega DSC) అని చెప్పి కేవలం 6 వేల అదనపు పోస్టులతో డీఎస్సీ అభ్యర్థులను దగా చేశాడు. నేడు విద్యార్ధులపై దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైయిరీలో నమోదు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చినాక వదిలిపెట్టం. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలనా అని కేటీఆర్ (KTR) ప్రశ్నించారు. అలాగే జర్నలిస్టులపైన పోలీసు దాడులు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు. రాహుల్ గాంధీతో సహా నిరుద్యోగులను ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. జాబ్ క్యాలెండర్ పేరు చెప్పి దినపత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు చేసింది..అవి చూసే ఓట్లు వేశారు. ఇప్పుడు ఆ జాబ్స్ గురించి అడిగేతే జైల్లో పెడుతున్నారు ఏది ఎక్కడి న్యాయం.? తెలంగాణలోని నిరుద్యోగులను, విద్యార్థులను అధికారం కోసం వాడుకున్న రాహుల్ గాంధీ సన్నాసా..? లేక రేవంత్ రెడ్డి సన్నాసా..? అని ప్రశ్నించారు.
Read Also : YouTuber Praneeth : యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్