YouTuber Praneeth : యూట్యూబర్ ప్రణీత్‌కు 14 రోజుల రిమాండ్
ఇటీవల సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడం తో ప్రణీత్ లాంటి వారు రెచ్చిపోతున్నారు. వ్యూస్ కోసం , డబ్బు కోసం వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు
- Author : Sudheer
Date : 11-07-2024 - 8:18 IST
Published By : Hashtagu Telugu Desk
సోషల్ మీడియాలో తండ్రి, కూతురు బంధంపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ..వీడియోలు పెట్టిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు(YouTuber Praneeth Hanuman)ను నిన్న బెంగుళూర్ లో హైదరాబాద్ పోలీసులు అరెస్టు (Arrest) చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు నాంపల్లి కోర్ట్ లో హాజరు పరచగా.. ప్రణీత్ కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే కేసులో ఏ2గా డల్లాస్ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణను ఉన్నారు. ప్రణీత్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇటీవల సోషల్ మీడియా వాడకం పెరిగిపోవడం తో ప్రణీత్ లాంటి వారు రెచ్చిపోతున్నారు. వ్యూస్ కోసం , డబ్బు కోసం వావివరుసలు మరచి ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు. ప్రణీత్ విషయానికి వస్తే..ఇతడు కూడా అంతే..నలుగుర్ని కూర్చోపెట్టి ఇతరుల ఫై బాడ్ కామెంట్స్ చేయడం..బూతులు మాట్లాడడం వంటివి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతుంటాడు. తాజాగా తండ్రి , కూతురి ఫై చేసిన వీడియో కూడా అలాంటిదే. ఈ వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుండడం చూసిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్..ఇతడి ఫై కేసు నమోదు చేయాలంటూ తెలంగాణ సర్కార్ ను కోరుతూ ట్వీట్ చేసాడు. ఆ తర్వాత వరుసపెట్టి సినీ హీరోలు షేర్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది..జైలు కు పంపించారు. ఇతడి అరెస్ట్ తర్వాతయినా ఇలాంటి వారు కంట్రోల్ అవుతారో చూడాలి.
Read Also : Fenugreek : మెంతి ఆకులే కదా అని పక్కన పడేయకండి..దీని లాభాలు తెలిస్తే వదిలిపెట్టారు