HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Ktr Criticises Congress Government

SLBC Tunnel Accident : కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ‘సర్కస్’ – KTR

SLBC Tunnel : ఇప్పటికే ఘటన జరిగి ఏడు రోజులు గడిచినప్పటికీ, అధికారికంగా స్పష్టమైన ప్రకటన లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు

  • Author : Sudheer Date : 01-03-2025 - 10:21 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SLBC Tunnel Incident
SLBC Tunnel Incident

SLBC Tunnel Accident : SLBC టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వ మంత్రి వర్గ సభ్యులు అనుసరిస్తున్న విధానం నిర్లక్ష్యంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికే ఘటన జరిగి ఏడు రోజులు గడిచినప్పటికీ, అధికారికంగా స్పష్టమైన ప్రకటన లేకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. కార్మికుల కుటుంబాలు వారి ఆచూకీ కోసం వేచి చూస్తున్న సమయంలో ప్రతీ మంత్రి, ఎమ్మెల్యే ఎవరికీ వారు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు.

TGSRTC : బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్

ఒక ఎమ్మెల్యే మృతదేహాలు లభ్యమయ్యాయని చెబుతుండగా, మరొకరు ప్రధాని మోదీ ఎందుకు సంతాపం తెలుపడం లేదని ప్రశ్నించారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరో మంత్రి ప్రమాదంలో ఎవరూ బ్రతికే అవకాశం లేదని వ్యాఖ్యానించడాన్ని ఆయన ‘సర్కస్’తో పోల్చారు. ఇంత తీవ్రమైన ఘటనపై అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సిన ప్రభుత్వం, ప్రతి ఒక్కరు తాము అనుకున్న విధంగా ప్రకటనలు చేస్తూ ప్రజలను మరింత గందరగోళానికి గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ameenpur Cheruvu : అమీన్‌పూర్ పెద్ద‌చెరువులో జేఏసీ పేరిట దందా..!

కాంగ్రెస్ నేతల పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించట్లేదని, కేవలం హాస్యాస్పద డ్రామాగా మార్చిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం అధికారిక ప్రకటన చేయలేరా? అని ప్రశ్నించారు. కార్మికుల ప్రాణాలకు ఈ ప్రభుత్వంలో విలువ లేదని విమర్శించారు. ప్రమాదం జరిగినప్పటి నుంచి ఒక్క స్పష్టమైన అధికారిక ప్రకటన కూడా లేకపోవడం కార్మికుల కుటుంబాలను మరింత ఆందోళనకు గురిచేస్తోందని, ప్రభుత్వం తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 8 Workers Dead Body
  • Congress Govt
  • ktr
  • SLBC Tunnel
  • SLBC Tunnel Operation
  • SLBC Tunnel Updates
  • srisailam

Related News

KTR- Harish Rao

BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

తెలంగాణ రాజకీయాల్లో బీఆర్‌ఎస్ నాయకత్వంపై పలు విమర్శలు, ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్‌రావు రాష్ట్ర యువతను హింసాత్మక మార్గాల వైపు ప్రేరేపిస్తున్నారంటూ కొన్ని రాజకీయ వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి. పదేళ్లపాటు అధికారంలో ఉన్న తర్వాత కూడా బీఆర్‌ఎస్ నాయకత్వం ప్రజాస్వామ్య మార్గాల కంటే ఆందోళనలు, నిరసనలు, దూకుడు రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్

    Latest News

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    • Revanth Reddy : తెలుగు ఆత్మగౌరవం నుంచి ప్రజా సంక్షేమం వరకు.. రేవంత్ రెడ్డి విజన్

    • Krishna Jayashankar : బాడీ షేమింగ్ నుంచి బంగారు పతకం వరకు.. కృష్ణ జయశంకర్ సరికొత్త చరిత్ర!

    • Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

    • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd