KTR : అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటీఫికేషన్లు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు?: కేటీఆర్
రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చెప్పి.. కాంగ్రెస్‌లోని ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు తమ ఉద్యోగాలు తెచ్చుకున్నారని విమర్శించారు.
- By Latha Suma Published Date - 04:55 PM, Sun - 14 July 24

KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరుద్యోగుల( unemployed)పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే పరీక్షలను వాయిదా వేయాలని కొరుతున్నారని చేసిన ఆరోపణలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశలు చెప్పి.. కాంగ్రెస్‌లోని ఇద్దరు రాజకీయ నిరుద్యోగులు తమ ఉద్యోగాలు తెచ్చుకున్నారని విమర్శించారు. ఒకాయన ముఖ్యమంత్రి అయితే.. మరొకాయన జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యాడని అన్నారు. కానీ తెలంగాణలో ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలకు అతి గతి లేదని మండిపడ్డారు.
Two politically unemployed fraudsters of Congress provoked the Telangana youth against the KCR Government by promising them the moon
Thanks to the youth, now those two have cushy jobs
In the last 7 months, neither was a single job notification given nor a single job delivered… pic.twitter.com/GCoS0K7G4O
— KTR (@KTRBRS) July 14, 2024
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి సత్తా ఉంటే..కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే శ్వేతపత్రం(white paper) ప్రచురించమని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చాక ఎన్ని నోటీఫికేషన్లు ఇచ్చారు? ఎన్నిఉద్యోగాలు భర్తీ చేశారు? మీరిచ్చిన జాబ్ క్యాలెండర్‌లోని ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారో స్పష్టంగా ఒక శ్వేతపత్రం ప్రకటించాలని కేటీఆర్ అన్నారు. మోతీలాల్ అనే వ్యక్తి ఉద్యోగాలకే రాస్తలేడు.. ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడని అవమానించేలా గ్రూప్‌కు ప్రిపేర్ అవుతున్న వ్యక్తిని అవమానించేలా ముఖ్యమంత్రి మాట్లాడారని కేటీఆర్ అన్నారు. ఏ కోచింగ్ సెంటర్లను అయితే ఆలంబనగా చేసుకుని నువ్వు, మీ రాహుల్‌గాంధీ వెళ్లి రెండు ఉద్యోగాలు సంపాదించుకున్నారో.. ఆ కోచింగ్ సెంటర్ నిర్వాహకులను అవమానించేలా వందల కోట్లు సంపాదించుకునేందుకు పరీక్షలు వాయిదా వేయాలని మాట్లాడటం కరెక్ట్ కాదని హితవు పలికారు. అందుకే తెలంగాణ యువత భగ్గుమంటున్నదని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) అయితే రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తుందని ఎన్నో ఆశలతో ఏ యువత అయితే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిందో.. అదే యువత నిన్ను ప్రశ్నిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తయ్యి ఎనిమిదో నెలలలోకి అడుగుపెట్టిందని కేటీఆర్ అన్నారు. ఈ 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని వెల్లడించారు. మిగతా 4 నెలల్లో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఎట్ల ఇస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. ఇచ్చిన మాటను నెలబెట్టుకునేదాకా మిమ్మల్ని వదిలిపెట్టమని స్పష్టం చేశారు. శాసనసభలో.. ప్రజా క్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు. ఏ నిరుద్యోగుల్ని అయితే మోసం చేశావో.. వాళ్లకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
Read Also: Padi Kaushik : కేసీఆర్‌ని విమర్శించే స్థాయి దానంకు లేదు – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి