Padi Kaushik : కేసీఆర్‌ని విమర్శించే స్థాయి దానంకు లేదు – ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్‌ఎస్ పడిపోదని , కార్యకర్తలు అధైర్యపడొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని ధీమా వ్యక్తం చేసారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చారని , 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని గుర్తు చేసారు
- By Sudheer Published Date - 04:51 PM, Sun - 14 July 24

కేసీఆర్ (KCR)ని విమర్శించే స్థాయి దానం నాగేందర్ (Danam Nagender)కు లేదని , సిగ్గుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనీ డిమాండ్ చేసారు హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. గత కొద్దీ రోజులుగా బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వరుస పెట్టి కాంగ్రెస్ లో చేరుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోగా..మరికొంతమంది కూడా ఇదే బాటలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేసారు. త్వరలో బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం కాబోతోందని, ఆ పార్టీలో మిగిలేది నలుగురు ఎమ్మెల్యేలు అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఆదివారం తెలంగాణ భవన్ లో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ..ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన బీఆర్‌ఎస్ పడిపోదని , కార్యకర్తలు అధైర్యపడొద్దని, మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్‌ఎస్సేనని ధీమా వ్యక్తం చేసారు. ఏ రాష్ట్రంలో ఇవ్వనన్ని ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చారని , 2 లక్షల 32 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారని గుర్తు చేసారు. ఇక కేసీఆర్ , కేటీఆర్‌పై దానం నాగేందర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కేసీఆర్, కేటీఆర్‌లను విమర్శించే స్థాయి దానం నాగేందర్‌కు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనకు సిగ్గుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నారు. కాంగ్రెస్ తనకు అన్యాయం చేసిందని అన్నారని, కేసీఆర్ దయతో గెలిచానని దానం నాగేందర్ గతంలో చెప్పారని గుర్తుచేశారు. ప్రజలను వేధించడంలో దానంను మించినోడు లేడని విమర్శించారు. త్వరలోనే దానం ఆక్రమణలు, అక్రమాలు బయటపెడతామన్నారు. బీఆర్‌ఎస్ నుంచి పోయిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లోకి పోతున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇస్తున్నారని ప్రశ్నించారు.
Read Also : Mumbai : సీఎం ఏక్నాథ్ షిండేతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటి