Adani issue : సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా?: కేటీఆర్
బీఆర్‌ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్‌ఎస్ ఇచ్చింది అంటారు.
- By Latha Suma Published Date - 02:31 PM, Tue - 26 November 24

KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి విమర్శులు గుప్పించారు. రాహుల్ గాంధీ తిట్టడంతో సీఎం రేవంత్‌రెడ్డి ఫస్ట్రేషన్‌లో ఏదోదో మాట్లాడారని, చిట్టి నాయుడు చిప్ దొబ్బిందని మండిపడ్డారు. అసలు ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా బీఆర్‌ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన పనులు అంటూ ఏదో పిచ్చి రిపోర్టు విడుదల చేశారని ఎద్దేవా చేశారు. అవన్నీ బీఆర్‌ఎస్ హయాంలో అదానీకి ఇచ్చిన ప్రాజెక్టులని అవగాహన లేకుండా మాట్లాడారు. రేవంత్‌ది ఎంత మూర్ఖత్వమంటే ఇందులో జాతీయ రహదారుల ప్రాజెక్టులు బీఆర్‌ఎస్ ఇచ్చింది అంటారు.
జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? రక్షణ శాఖ ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎంపీగా పనిచేసినోడికి ఈ మాత్రం తెలియదా? అని మండిపడ్డారు. ఇంత మూర్ఖంగా ప్రజల తెలివి తేటలను తక్కువగా అంచనా వేసి నోటికి వచ్చినట్లు వాగుతాను అన్నట్లు రేవంత్ వ్యవహారం ఉన్నదన్నారు. సీఎం అవగాహనా రాహిత్యంతో మాట్లాడితే ఎలా? అని ప్రశ్నించారు. అదానీ కలిసి కొన్ని ప్రతిపాదనలు ఇస్తే అప్పటి సీఎం కేసీఆర్ తిరస్కరించారని నాటి పేపర్ క్లిప్‌లను మీడియాకు చూపెట్టారు. అదానీకి మేము రెడ్ సిగ్నల్ వేస్తే.. మీరు రెడ్ కార్పెట్ వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మైక్రోసాప్ట్ నుంచి రెండు దశల్లో ఒకసారి రూ. 15 వేల కోట్లు….రెండో సారి రూ. 16 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చినట్లు కేటీఆర్ చెప్పారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం అది అదానీ డేటా సెంటర్ అని రిలీజ్ చేశాడని అంటున్నారు. మైక్రో సాప్ట్ డేటా సెంటర్ పెట్టుబడిని.. అదానీ డేటా సెంటర్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. సబ్జెక్ట్ తెలియక ఏదీ పడితే అది మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర గౌరవం మంటకలుస్తుందని సెటైర్ లు వేశారు. గతంలో కూడా విప్రో ఛైర్మన్ సత్య నాదెళ్ల అంటూ నవ్వుల పాలు అయిన విషయం గుర్తు చేశారు. మైక్రో సాప్ట్ వచ్చాక ఆమెజాన్ వచ్చిందని.. అమెజాన్ రూ. 36 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు.
తాను.. అదానీని కలిశాను అని ఫోటో రిలీజ్ చేశాడు. బరాబర్ దావోస్ లో కలిశాను. ఆ ఫోటోను నేనే నా ట్విట్టర్ లో పెట్టినట్లు క్లారిటీ ఇచ్చారు. నీలాగా ఇంటికి పిలిపించుకోని నాలుగు గంటలు రహస్యంగా కలవలేదని.. కోహినూరు హోటల్ లో కాళ్లు పట్టుకోలేదంటూ ఎద్దేవా చేశారు. తనకు.. నీ లాగా లుచ్చా పనులు చేసే అలవాటు లేదని, ఏదీ చేసిన బజాప్తా చేస్తామంటూ ఫైర్ అయ్యారు. కొండారెడ్డి పల్లిలో నీకోసం పనిచేసిన మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు గురించి కూడా మాట్లాడారు. ప్రశ్నిస్తే.. సైకో అంటున్నవని కేటీఆర్ విమర్శలు చేశారు.