Krishna river : మళ్లీ ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదం
- By Latha Suma Published Date - 01:21 PM, Fri - 19 April 24
Krishna river water dispute: కృష్ణా నదీ జలాల వివాదం చాలా పురాతనమైనది.. ఇది పూర్వపు హైదరాబాద్, మైసూర్ రాష్ట్రాలతో ప్రారంభమై తరువాత మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతోంది. ఉమ్మడి రాష్ట్రం విడిపోయి ఏళ్లు గడుస్తున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపకాలపై దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదం అపరిష్కృతంగానే ఉంది. అయితే తాజాగా ఏపీ(Ap), తెలంగాణ(Telangana) మధ్య మరోసారి కృష్ణా జలాల వివాదం భగ్గుమంది. నాగార్జున సాగర్ టెయిల్ పాండ్‌లో నీటి నిల్వలు ఖాళీగా ఉండటం తీవ్ర కలకలం రేపింది.
We’re now on WhatsApp. Click to Join.
టెయిల్ పాండ్ లో నీటిని ఏపీ సర్కార్ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకు తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడే ప్రమాదముంది. అయితే రెండు రోజుల క్రితం టెయిల్ పాండ్‌ను నీటి పారుదుల శాఖ కమిషనర్ సుల్తానియా సందర్శించారు. టెయిల్ పాండ్ లోని నీటిని ఏపీ తరలించడంపై అధికారుల ద్వారా సుల్తానియా వివరాలు సేకరించారు. ఏపీ నీటి వినియోగంపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు. ఏపీ తీరుపై కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.