Kishan Reddy: కిషన్ రెడ్డి అలక.. మోడీ కేబినెట్ సమావేశానికి గైర్హాజరయ్యారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి.
- Author : Praveen Aluthuru
Date : 05-07-2023 - 2:28 IST
Published By : Hashtagu Telugu Desk
Kishan Reddy: ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్ధమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ లో భారీ చేరికలు మొదలయ్యాయి. పార్టీలోనూ ఒకింత జోష్ కనిపిస్తుంది. నిన్నటికి నిన్న రాహుల్ గాంధీ జన గర్జన సభ ద్వారా కాంగ్రెస్ సత్తా ఏంటో నిరూపించింది. ఇదిలా ఉండగా తెలంగాణ బీజేపీలోని మార్పులు చేర్పులు మొదలయ్యాయి. నిన్న మంగళవారం కేంద్రం తీసుకున్న నిర్ణయం ద్వారా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. ఈటెల రాజేందర్ ఎన్నికల నిర్వాహక కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇదిలా ఉండగా కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించడంతో కిషన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తుంది. తన అసంతృప్తిని సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడుతున్నారట.
ఈ రోజు బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ భేటీకి కిషన్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఇంకా ఆయన మంత్రి పదవికి రాజీనామా కూడా చేయలేదు. ఈ క్రమంలో కిషన్ రెడ్డి కేంద్ర క్యాబినెట్ భేటీకి హాజరవ్వాల్సి ఉంది. అయితే కిషన్ రెడ్డి భేటీకి గైర్హాజరయ్యావ్వడం చర్చనీయాంశమైంది.
Read More: Jonny Bairstow Wicket: వివాదాస్పద ఔట్.. ఆస్ట్రేలియా పోలీసులు బెయిర్‌స్టోని ఇలా కూడా వాడేశారుగా..!