Kishan Reddy : ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారు: కిషన్ రెడ్డి
Kishan Reddy : రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ ప్రభుత్వం ఏటీఎం ద్వారా.. డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారని అన్నారు.
- By Latha Suma Published Date - 04:29 PM, Tue - 12 November 24

Maharashtra Elections : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణలో ఏడాదిగా ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ పచ్చి అబద్ధాలతో నిత్యం ప్రజలను మోసం చేస్తుందన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వచ్చి అబద్ధాలను ఇక్కడి ప్రజలకు చెప్పారని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, 420 సబ్ గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టిందని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత ఎలా మోసం చేస్తోందో మహారాష్ట్ర ప్రజలకు వివరించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను అని కిషన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు.. కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా మారాయని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజల నడ్డి విరుస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో పూర్తిగా అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. తెలంగాణలో గెలిచిన తర్వాత దేశంలో ఏ ఎన్నికలు జరిగినా.. తెలంగాణ ప్రభుత్వం ఏటీఎం ద్వారా.. డబ్బులు తెచ్చి మిగిలిన చోట్ల ఖర్చుపెడుతున్నారని అన్నారు. ఇచ్చిన హామీల్లో 99% ఇంకా మొదలే కాలేదన్నారు. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాలకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జోడీ.. తెలంగాణ ప్రజలను ఎలా మోసం చేశారో.. అదే తరహాలో మహారాష్ట్ర ప్రజలను కూడా మభ్యపెట్టాలని చూస్తున్నారని కిషన్ రెడ్డి విర్శలు చేశారు.
ఇక..మేనిఫెస్టోలో మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని తెచ్చి నెలకు రూ.2,500 రూపాయలు.. ఇప్పటివరకు ఏ ఒక్క మహిళకు కూడా ఈ పథకం లబ్ధి అందలేదని తెలిపారు. రైతులకు రైతు భరోసా, వివిధ పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని.. అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో.. ఒక్క ఇంటికి కూడా శంకుస్థాపన చేయలేదన్నారు. అయితే హైదరాబాద్‌లో మాత్రం.. మూసీ పేరుతో.. దశాబ్దాలుగా ఉన్నవారిని ఇండ్లనుంచి బయటకు గెంటేసి.. ఆ ఇళ్లు కూల్చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.