Maha ganapati : గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాత్ గణనాథుడు..
khairatabad maha ganapati immersion: మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. క్రేన్ నెంబర్ నాలుగు వద్ద… ఖైరతాబాద్ విగ్రహాన్ని..గంగమ్మ ఒడికి చేర్చారు. భారీ భక్తజన సంద్రం.. చూస్తున్న తరుణంలోనే.. ఆ గంగమ్మ ఒడికి చేరిపోయారు ఖైరతాబాద్ మహాగణపతి.
- By Latha Suma Published Date - 02:06 PM, Tue - 17 September 24

khairatabad maha ganapati immersion: ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరారు. కాసేపటి క్రితమే.. భారీ క్రేన్ల సహాయంతో ఖైరతాబాద్ మహాగణపతిని.. గంగమ్మ ఒడికి చేర్చారు. మధ్యాహ్నం 1.39 గంటలకు ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం పూర్తయింది. క్రేన్ నెంబర్ నాలుగు వద్ద… ఖైరతాబాద్ విగ్రహాన్ని..గంగమ్మ ఒడికి చేర్చారు. భారీ భక్తజన సంద్రం.. చూస్తున్న తరుణంలోనే.. ఆ గంగమ్మ ఒడికి చేరిపోయారు ఖైరతాబాద్ మహాగణపతి.
Read Also: Jio Services Down : జియో సేవల్లో అంతరాయం.. వేలాదిగా ఫిర్యాదుల వెల్లువ
70 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఖైరతాబాద్ విగ్రహం.. ఈసారి ఏడు ముఖాలతో దర్శనమించారు. 70 సంవత్సరాలు అయిన నేపథ్యంలో 70 అడుగులతో విగ్రహాన్ని ఏర్పాటు చేసింది కమిటీ. ఇక ఇవాళ ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభం కాగా… కాసేపటి క్రితమే నిమజ్జనం కూడా పూర్తయింది.
కాగా, గణనాథుని విగ్రహాన్ని వేలాది మంది భక్తుల మధ్య డప్పుల మోత, డీజేల కోలాహలమైన సంగీతం మధ్య ట్యాంక్‌బండ్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. శోభాయాత్రను తిలకించేందుకు వేలాది మంది భక్తులు రోడ్లపైకి రావడంతో ఖైరతాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మహా గణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు సహకరించాలని కోరారు.
Read Also: Rani Kumudi : తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియమకం
మరోవైపు గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిలిచారు. పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగిన ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నంబర్ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారు.