Rani Kumudi : తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియమకం
Rani Kumudi appointed as Election Commissioner of Telangana: ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలం సెప్టెంబర్ 08వ తేదీనే ముగియడంతో ఆయన స్థానంలో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది.
- By Latha Suma Published Date - 01:48 PM, Tue - 17 September 24

Rani Kumudi appointed as Election Commissioner of Telangana: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రిటైర్డ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రాణి కుముదిని నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీ కాలం సెప్టెంబర్ 08వ తేదీనే ముగియడంతో ఆయన స్థానంలో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది.
Read Also: Simple Tips : పాలు పాడవకుండా ఉండాలంటే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..!
ఈ మేరకు గవర్నర్ బిష్ణు దేవ్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్ల పాటు ఆమె ఎస్ఈసీగా కొనసాగనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1988 బ్యాచ్ కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించారు. కేంద్ర సర్వీసుల అనంతరం తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు చేపట్టారు. 2023 ఎన్నికలకు ముందు పదవీ విరమణ చేశారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఆమెను తిరిగి అదే హోదాలో కొనసాగించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నూతన ఎస్ఈసీ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా విశ్రాంత ఐఏఎస్ ఎంజీ గోపాల్‌ను ప్రభుత్వం నియమించారు. 1983 బ్యాచ్‌కు చెందిన గోపాల్ ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఆయనను రాష్ట్ర విజిలెన్స్ కమిషనర్‌గా మూడేండ్ల పాటు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.