KCR Wanted NDA: బీజేపీలోకి కేసీఆర్..? మోడీ షాకింగ్ కామెంట్స్
తెలంగాణాలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. ఈ సారి అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీట్ పుట్టిస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 06:39 PM, Tue - 3 October 23

KCR Wanted NDA: తెలంగాణాలో ఎలక్షన్ ఫీవర్ మొదలైంది. ఈ సారి అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ హీట్ పుట్టిస్తున్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ రంగంలోకి దిగారు. కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తనకు సహాయం చేసి గెలిపించాలని కేసీఆర్ మోడీని కోరిన విషయాన్ని కుండబద్దలు కొట్టారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఎన్డీయేతో కలవాలనుకున్నారని మోడీ చెప్పారు. అయితే కేసీఆర్ అభ్యర్థనను తిరస్కరించడంతో బీజేపీ మీద కోపంగా ఉగిపోతున్నాడని మోడీ అన్నారు.
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హైదరాబాద్ నిజాం పాలనలో ఉందని, గుజరాత్ నేత సర్దార్ వల్లభాయ్ పటేల్ తన బలాన్ని ప్రదర్శించి హైదరాబాదీల స్వేచ్ఛకు భరోసా ఇచ్చాడని, ఇప్పుడు ఇదే హైదరాబాద్ కోసం మరొక గుజరాత్ నేత అంటే మోడీ ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.ఒకసారి కేసీఆర్ ఢిల్లీకి వచ్చి కుమారుడు కేటీఆర్ ని సీఎం చేసే ఆలోచనలో ఉన్నానని, కేటీఆర్ ను ఆశీర్వదించాలని కేసీఆర్ తనను కోరారని ప్రధాని వివరించారు. అయితే తెలంగాణకు సీఎం ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారని కేసీఆర్ తో అన్నట్టు మోడీ తెలిపారు. .
రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం నిధులు కేటాయించిందని, తెలంగాణ ప్రజల నిధులను బీఆర్‌ఎస్ దోచుకుంటోందని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి చేయగలిగినదంతా చేసింది. ఇప్పటికే అనేక దఫాలుగా డబ్బు చెల్లించింది. కానీ బీఆర్‌ఎస్ తమకు చేతనైనంత దోచుకుందని మోడీ ఆరోపించారు.
Also Read: Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డి సొంతగూటికి చేరుకుంటారా