KCR Sends Chadar: అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కెసిఆర్
అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్)ను కేసీఆర్ పంపించడం సంప్రదాయకంగా వస్తున్నది. ప్రతియేటా ఆయన చాదర్ ముస్లిం పెద్దలకు అందజేస్తారు. చాదర్ తో పాటు ఎంతోకొంత నజరానా అందజేస్తారు.
- By Praveen Aluthuru Published Date - 06:25 AM, Mon - 8 January 24
 
                        KCR Sends Chadar: అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల్లో సమర్పించే చాదర్ (గిలాఫ్)ను కేసీఆర్ పంపించడం సంప్రదాయకంగా వస్తున్నది. ప్రతియేటా ఆయన చాదర్ ముస్లిం పెద్దలకు అందజేస్తారు. చాదర్ తో పాటు ఎంతోకొంత నజరానా అందజేస్తారు. అందులో భాగంగా ఈ ఏడాది వార్షిక ఉర్స్ వేడుకల కోసం అజ్మీర్ దర్గాకు చాదర్ పంపారు
కేసీఆర్ దశాబ్దాలుగా అజ్మీర్ దర్గాకు ప్రతి సంవత్సరం చాదర్‌ను పంపుతున్నట్లు పార్టీ పేర్కొంది .చాదర్ తీసుకుని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, బీఆర్‌ఎస్ నేత ఆజం అలీ కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మహమూద్ అలీ మాట్లాడుతూ 2001 నుంచి కేసీఆర్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ అజ్మీర్ దర్గాకు చాదర్ పంపారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన ఆ సంప్రదాయాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. అజ్మీర్‌లో సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి పార్టీ ఒక ఎకరం భూమిని కూడా కొనుగోలు చేసింది. అయితే రాజస్థాన్ ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడంతో, నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేశారు. కాగా వచ్చే వారం అజ్మీర్‌లో ఉర్స్ జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రము బాగుపడాలని మేము కోరుకుంటున్నాము అని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు.
అజ్మీర్ ఉత్సవాలు గొప్పగా జరగాలని, అందరికీ శుభం కలగాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఇతర మైనారిటీ నేతలు ఉన్నారు. రాజస్థాన్ రాష్ట్రం అజ్మీర్‌లోని హజ్రత్ ఖాజా మొయినుద్దీన్ చిస్తీ గరీబ్ నవాజ్ దర్గాకు ప్రతియేటా సంప్రదాయబద్ధంగా తెలంగాణ నుంచి చాదర్‌ను తీసుకెళుతుంటారు.