BRS Chevella Sabha : విజయమే లక్ష్యంగా ఈరోజు చేవెళ్ల లో కేసీఆర్ భారీ బహిరంగ సభ
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు జరిగాయి..? రాష్ట్రంలో కరువు..? నీటి సమస్య..? గిట్టుబాటు ధర లేకపోవడం..? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోవడం తదితర అంశాలను చేవెళ్ల సభ వేదికగా ప్రశ్నించబోతున్నారు.
- By Sudheer Published Date - 10:47 AM, Sat - 13 April 24

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)..ఇప్పుడు లోక్ సభ (Lok Sabha) ఎన్నికలతో తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా అనేక వ్యూహాలు రచిస్తూ..అధికార పార్టీ కాంగ్రెస్ ను , కేంద్రంలోని బిజెపి(BJP)ని దెబ్బ తీయాలని చూస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్ , నల్గొండ లలో భారీ బహిరంగ సభలు నిర్వహించి బిఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్..ఈరోజు చేవెళ్ల (Chevella ) లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు జరిగాయి..? రాష్ట్రంలో కరువు..? నీటి సమస్య..? గిట్టుబాటు ధర లేకపోవడం..? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేకపోవడం తదితర అంశాలను చేవెళ్ల సభ వేదికగా ప్రశ్నించబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న మొదటి సభ కావడంతో పార్టీ నేతలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని సభ విజయవంతానికి కృషిచేస్తున్నారు. 2 లక్షలకు పైగా జనసమీకరణకు పార్టీ శ్రేణులు కసరత్తుచేస్తున్నాయి. చేవెళ్లలోని ఫరా ఇంజనీరింగ్ కళాశాలలో సాయంత్రం 5 గంటలకు ఈ సభ మొదలుకానుంది. ఇప్పటికే చేవెళ్ల ప్రధాన కూడళ్లు, రహదారుల అంత గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతో గులాబీమయంగా మార్చారు. పార్టీ నేతల ఏకాభిప్రాయం మేరకు చేవెళ్ల జనరల్ స్థానంలో బీసీ సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్ కు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. చేవెళ్ల లో కాసాని జ్ఞానేశ్వర్ కు మంచి పేరు , గుర్తింపు ఉండడం తో ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన పేరు ప్రకటించడమే తరువు ఆయన తన ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఇక కాంగ్రెస్ నుండి రాజీత్ రెడ్డి బరిలోకి దిగబోతున్నాడు. వాస్తవరానికి ఈయన బిఆర్ఎస్ ఎంపీగా గెలిచారు..రీసెంట్ గా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి , కాంగ్రెస్ లో చేరి , చేవెళ్ల టికెట్ దక్కించుకున్నారు. అలాగే బిఆర్ఎస్ కు చేరిన పట్నం మహేందర్ రెడ్డి , ఆయన భార్య సునీత సైతం రీసెంట్ గా బిఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇలా చేవెళ్ల కు సంబదించిన కీలక నేతలు బిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరడం తో ఎక్కడ గెలుపు ఎవర్ని వరిస్తుందనేది కీలకంగా మారింది. మరి ఈరోజు జరిగే సభలో కేసీఆర్ ఎలాంటి విమర్శలు, పార్టీ మారిన నేతల గురించి ఎలా మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది.
Read Also : Rishabh Pant: ఐపీఎల్‌లో రికార్డు సృష్టించిన రిషబ్ పంత్.. తక్కువ బంతుల్లోనే 3 వేల పరుగులు..!