TRS Govt : మరో అప్పుకు కేసీఆర్ సర్కార్ రెడీ.. ఈ సారి 2 వేల కోట్లకు టెండర్..!!
తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ మీరో కీలక నిర్ణయం తీసుకుంది.
- Author : hashtagu
Date : 05-09-2022 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని కేసీఆర్ సర్కార్ మీరో కీలక నిర్ణయం తీసుకుంది. బాండ్ల విక్రయం ద్వారా రూ. 2వేల కోట్ల మేర నిధులను సమీకరించాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విలువైన బాండ్లను 8ఏళ్ల కాలానికి…మరో వెయ్యికోట్లు రూపాయల విలువైన బాండ్లను 9ఏళ్ల కాలానికి జారీ చేసింది. ఈ బాండ్లు వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వేలం వేయనుంది.
ఆగస్టు 23న వెయ్యికోట్లను రుణాల ద్వారా ప్రభుత్వం నిధులను సమీకరించుకుంది. రెండు వారాలకే మరో రెండు వేల కోట్ల విలువైన బాండ్లను జారీ చేసింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్భిఎం పరిధికి లోబడి సర్కార్ తీసుకునే రుణాల మొత్తం 18వేల500కోట్లు చేరనుంది. మూలధనంకింద వీటిని ఖర్చు చేసి డెవలప్ మెంట్ కు బాటలు వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.