HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Kcr Eyes National Politics Prashant Kishor Differs

KCR Politics: కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ లే.. మరి పీకే ప్లాన్ అలా ఎందుకు మారింది?

తెలంగాణ సీఎం కేసీఆర్ నేష‌న‌ల్ పాలిటిక్స్‌ ఎపిసోడ్ మాంచి దూకుడుమీదే ఉంది. ఆ ఆవేశం ఆయనలో కనిపిస్తున్నా... అవతలి పరిస్థితులు మరీ అంత అనుకూలంగా ఉన్నట్టు అనిపించడం లేదు. దీనికి కారణాలు వేరువేరుగా ఉన్నాయి.

  • Author : Hashtag U Date : 03-03-2022 - 9:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr Flight
Kcr Flight

తెలంగాణ సీఎం కేసీఆర్ నేష‌న‌ల్ పాలిటిక్స్‌ ఎపిసోడ్ మాంచి దూకుడుమీదే ఉంది. ఆ ఆవేశం ఆయనలో కనిపిస్తున్నా… అవతలి పరిస్థితులు మరీ అంత అనుకూలంగా ఉన్నట్టు అనిపించడం లేదు. దీనికి కారణాలు వేరువేరుగా ఉన్నాయి. పీకే టీమ్ తో ఒప్పందం చేసుకున్న తరువాత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడంలో బిజీగా ఉన్న కేసీఆర్.. ఢిల్లీకి కూడా వెళ్లారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను కలవడానికే అని ప్రచారం జరిగింది. కానీ అసలు ఎపిసోడ్ వేరుగా ఉంది.

కేసీఆర్ ఢిల్లీకి వెళ్లింది నిజంగానే కేజ్రీవాల్ ను కలవడానికా అంటే కాదు. అయినా సరే టీఆర్ఎస్ నేతల ప్రచారం మాత్రం అలాగే ఉంది. నిజానికి కేజ్రీవాల్ అసలు ఢిల్లీలోనే లేరు. అలాంటప్పుడు కేసీఆర్ అక్కడికి వెళ్లి ఏం చేద్దామనుకున్నారు అన్న ప్రశ్నకు జవాబుగా.. ఆయన తనతోపాటు తన సతీమణి వైద్య పరీక్షల కోసమే అక్కడికి వెళ్లారంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. మరి కేజ్రీవాల్ తో భేటీ అన్న ప్రచారం ఎందుకు తెరపైకి వచ్చింది?

కాంగ్రెస్, బీజేపీల అండ లేకుండా ఢిల్లీలో చక్రం తిప్పాలంటే దానికి ప్రాంతీయ పార్టీల మద్దతు అవసరం. దానికోసం కేసీఆర్ చాలా వేగంగానే పావులు కదుపుతున్నారు. కానీ ఉత్తరాది ఎన్నికల్లో బిజీగా ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడు కేసీఆర్ ను కలుసుకునే వీలు లేదు. పైగా ఆయన బెంగళూరులోని జిందాల్ ప్రకృతి చికిత్సాలయంలో ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వెళ్లారని.. మరో వారం తరువాత వస్తారని తెలిసింది. మరి అలాంటప్పుడు ఢిల్లీలో కేసీఆర్ ఏం చేస్తున్నట్టు?

ఢిల్లీకి వెళ్లడం.. వెళ్లిన పని అవ్వక తిరిగి హైదరాబాద్ కు రావడం కేసీఆర్ కు అనుభవమే. కానీ గత అనుభవాల్లో భాగంగా ప్రస్తుత పర్యటనను చూడలేం. ఎందుకంటే బీజేపీతో రాజకీయ యుద్ధం చేస్తున్నారు. అందుకే రాజ్యాంగం మార్చాలని, రాష్ట్రాల అధికారాలను కేంద్రం లాగేసుకుంటోందని.. వాటిని అరికట్టాలని పోరాడుతున్నారు. దీనికోసమే జాతీయ రాజకీయాల్లో పట్టుకోసం ప్రయత్నిస్తున్నట్టుగా బిజీబిజీగా కనిపిస్తున్నారు.

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ కు మంచి ఫలితాలు వస్తే కేజ్రీవాల్ బలం పెరుగుతుంది. అందుకే ఆయనతో ముందుగానే భేటీ అయితే.. మద్దతు సంపాదించడం తేలికవుతుంది. పైగా రైతుల మద్దతు కూడా తమ
పోరాటానికి ముఖ్యమని కేసీఆర్ కు తెలుసు. దీనికోసమే రైతు నాయకుడు టికాయత్ తో కూడా భేటీకి ప్లాన్ చేశారు. మరి కేసీఆర్ ప్లాన్ వర్కవుటవుతుందా? లేక షరా మామూలే అన్నట్టుగా మారుతుందా అన్నది చూడాలి. కాకపోతే కేసీఆర్ ఏం చేసినా దీర్ఘకాలిక వ్యూహంతోనే చేస్తారన్న సంగతిని మర్చిపోకూడదు. ఈ టోటల్ ఎపిసోడ్ లో పీకే ప్లాన్ ఎంతమేర ఉందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • kcr
  • KCR game
  • national politics
  • prashant kishor
  • trs

Related News

Kavitha Jayalalitha

TRS : కేసీఆర్ పై మాట మార్చిన కవిత..!!

రాష్ట్ర రాజకీయాల్లో ఈ తండ్రీకూతుళ్ల పోరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేస్తుంటే, కవిత మాత్రం పాత 'టీఆర్ఎస్' (తెలంగాణ రక్షణ సేన) పేరుతో మళ్లీ రాష్ట్ర రాజకీయాల్లో బలపడాలని చూస్తున్నారు

  • Kavitha Jayalalitha

    TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

  • Kavitha Jayalalitha

    TRS : కవిత పార్టీ ని పాన్ షాప్ తో పోల్చిన రాజగోపాల్

  • KTR clarifies on organizations formed in his name

    BRS @ 25 Years : కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం – కేటీఆర్ ధీమా

  • Congress government has become a complete flop within two years: KTR

    BRS @ 25 Years : నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా అంటూ కేటీఆర్ ట్వీట్

Latest News

  • Karimnagar Robbery : పట్టపగలు కరీంనగర్‌లోని జ్యువెలరీ షాపులో కాల్పులు..!

  • Bandla Ganesh : చంద్రబాబు సమక్షంలో బండ్ల గణేష్ కూతురి నిశ్చితార్థ వేడుక

  • Kerala Result : కేరళంలో సంబరాలకు UDF, బీజేపీ ఏర్పాట్లు ..మరి ఏంజరుగుతుందో ?

  • Tamilnadu Results : తమిళనాడులో మొదలైన రిసార్ట్ పాలిటిక్స్ !

  • West Bengal Result : బెంగాల్లో హంగ్ ఏర్పడితే ఎలా ?

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd