Kavitha : కవిత నువ్వు ప్రజాశాంతి పార్టీలోకి రా – KA పాల్
Kavitha : కవిత బీసీల కోసం పోరాడాలన్నా, ప్రజల్లో ఆమెపై నమ్మకం పెరగాలన్నా ప్రజాశాంతి పార్టీలో చేరడం ఉత్తమమని సలహా ఇచ్చారు. గతంలో గద్దర్ లాంటి ప్రజా గాయకుడు కూడా తమ పార్టీలో చేరారని గుర్తు చేశారు
- By Sudheer Published Date - 08:30 PM, Wed - 3 September 25

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత(Kavitha)కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA PAUL) బహిరంగంగా ఆహ్వానం పలికారు. “కవిత నువ్వు బీజేపీ వదిలిన బాణం కాదని నిరూపించుకోవాలంటే ప్రజాశాంతి పార్టీలో చేరాలి” అని ఆయన అన్నారు. కవిత బీజేపీలో చేరతారని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో కేఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ ఆహ్వానం కవిత భవిష్యత్ నిర్ణయంపై ప్రభావం చూపుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.
Revanth Counter : మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి – కవిత కు రేవంత్ కౌంటర్
కేఏ పాల్ మాట్లాడుతూ.. కవిత బీసీల కోసం పోరాడాలన్నా, ప్రజల్లో ఆమెపై నమ్మకం పెరగాలన్నా ప్రజాశాంతి పార్టీలో చేరడం ఉత్తమమని సలహా ఇచ్చారు. గతంలో గద్దర్ లాంటి ప్రజా గాయకుడు కూడా తమ పార్టీలో చేరారని గుర్తు చేశారు. గద్దరన్న చేరిన ప్రజాశాంతి పార్టీలో కవిత కూడా చేరితే, తామిద్దరం కలిసి బీసీల కోసం పోరాటం చేద్దామని కేఏ పాల్ పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలు కవిత భవిష్యత్ కార్యాచరణను మరింత సందిగ్ధంలో పడేశాయి.
ప్రస్తుతం కవిత తన భవిష్యత్ కార్యాచరణను రెండు రోజుల తర్వాత ప్రకటిస్తానని తెలిపారు. ఈ నేపథ్యంలో కేఏ పాల్ ఆహ్వానం ఆమె దృష్టికి వెళ్లి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె బీజేపీలో చేరుతారా, సొంత పార్టీ పెడతారా, లేక ఇతర పార్టీలో చేరతారా అనే చర్చ నడుస్తున్న తరుణంలో, కేఏ పాల్ ఆహ్వానం ఆసక్తికరమైన మలుపుగా మారింది. అయితే ఈ ఆహ్వానాన్ని కవిత ఎలా స్వీకరిస్తారనేది వేచి చూడాలి.