CM Revanth Reddy : ఎస్సీలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తా : సీఎం రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, రాష్ట్రకేబినెట్ ని చప్పట్లతో అభినందించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాం. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9 శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాం.
- By Latha Suma Published Date - 03:31 PM, Wed - 19 March 25

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీలో నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఎస్సీ సంఘాల నాయకులు అసెంబ్లీ కమిటీ హాల్లో తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చినట్టు తెలిపారు. ఎస్సీలోని అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని తెలిపారు. వర్గీకరణ సుప్రీంకోర్టులో క్లియర్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లియర్ చేసింది.
Read Also: Budget: అన్ని వర్గాలవారికి బడ్జెట్ అండగా నిలిచింది: మంత్రి జూపల్లి కృష్ణారావు
తనను ఒక్కడినే అభినందించడం కాదు.. కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, రాష్ట్రకేబినెట్ ని చప్పట్లతో అభినందించాలని కోరారు. ఎస్సీ వర్గీకరణలో భాగంగా 15 శాతం రిజర్వేషన్లు కేటాయించాం. ఎస్సీల్లో గ్రూప్-1కు ఒక శాతం, గ్రూప్-2కు 9 శాతం, గ్రూప్-3కు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాం. అతి తక్కువ జనాభా కలిగి అభివృద్ధి ఫలాలు ఆశించిన వారిని గ్రూప్-1లో ఉంచాం. ‘ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాం. ఏళ్లుగా వాయిదా పడుతున్న కేసులో బలమైన వాదనలతో అత్యున్నత న్యాయస్థానాన్ని మెప్పించాం. భాజపా ప్రభుత్వాలు ఉన్న చోట కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు. ఎస్సీ వర్గాలకు నేను సీఎంగా ఉన్నప్పుడైనా న్యాయం చేయాలని బలంగా నమ్మాను. సమన్వయం చేసుకుంటూ శాసనసభలో అందరినీ కూడగట్టాం. బిల్లును ఎవరూ వ్యతిరేకించే సాహసం చేయలేదు అన్నారు.
అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని ఏనాడూ తీసుకెళ్లలేదు. మందకృష్ణతో ఎలాంటి విభేదాలు లేవు. వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి. నాకంటే మోడీ, కిషన్‌రెడ్డిని ఆయన ఎక్కువగా నమ్ముతున్నారు. బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేదు అని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎస్సీ వర్గీకరణ తీర్మానం పెట్టాలని 2014లో తెలంగాణ ఏర్పాడ్డాక అసెంబ్లీలో చెప్పా. దీనిపై కేంద్రానికి తీర్మానం పంపాలని కోరాం. తీర్మానం ప్రవేశపెడితే నాతో పాటు సండ్ర వెంకట వీరయ్య, సంపత్‌ను సభ నుంచి బహిష్కరించారు. మేం పెట్టిన తీర్మానాన్ని విధిలేని పరిస్థితుల్లో ఆనాడు సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ పట్టుదలతో లేకపోతే మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసే శక్తి రాదు. రాహుల్ గాంధీ తానున్నానని చెప్పడంతోనే చేసినట్టు తెలిపారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని చైర్మన్ గా పెట్టాలని దామోదర రాజనర్సింహ సూచించారు. అత్యంత నిజాయితీ పరుడు షమీ మక్తర్ ని వన్ మ్యాన్ కమిషన్ కి ఎంపిక చేశామని తెలిపారు. గ్రూపు బీ కి 9 శాతం కాదు.. 9.75 శాతం రిజర్వేషన్లు కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.