HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Jee Main 2025 Exam Schedule And New Ba Course In Telangana

JEE Main 2025 Exam: ప్రారంభమైన జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. తెలుగు రాష్ట్రాల నుంచి 1.5 లక్షల మంది

JEE Main 2025 Exam: ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్‌-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్‌ కోర్సుల కోసం పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

  • Author : Kavya Krishna Date : 22-01-2025 - 10:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jee Main 2025 Exam
Jee Main 2025 Exam

JEE Main 2025 Exam: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, బీటెక్‌, ఎన్‌ఐటీలలో బీఈ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత కల్పించే జేఈఈ మెయిన్‌ 2025 తొలివిడత ఆన్‌లైన్‌ పరీక్షలు బుధవారం (జనవరి 22) నుంచి ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో పేపర్‌-1 కోసం జరుగుతాయి. ఇక, చివరి రోజు జనవరి 30న బీఆర్క్, బీ ప్లానింగ్‌ కోర్సుల కోసం పేపర్‌ 2 పరీక్ష జరగనుంది. ఈ రెండు పేపర్లకు దేశవ్యాప్తంగా దాదాపు 12 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు 1.5 లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు.

Congress Schemes: అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు -భట్టి విక్రమార్క

ప్రతి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌ పరీక్షలు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం దేశవ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో జేఈఈ మెయిన్‌ 2025 రెండో విడత పరీక్షలు జరుగుతాయి. రెండు విడతలలో వచ్చిన ఉత్తమ స్కోర్‌ ఆధారంగా తుది ర్యాంకులు కేటాయిస్తారు.

జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన తొలి 2.5 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ ఆడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అనుమతిస్తారు. జేఈఈ ఆడ్వాన్స్‌డ్‌ పరీక్ష మే 18న జరగనుంది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులతో ఎన్‌ఐటీలు, అడ్వాన్స్‌డ్‌ ర్యాంకులతో ఐఐటీల్లో సీట్లు అందిపుచ్చుకోవచ్చు.

ప్రస్తుతం, దేశంలో 31 ఎన్‌ఐటీలు, 23 ఐఐటీలు, 10 ట్రిపుల్‌ఐటీలు , ఇతర విద్యాసంస్థల్లో కలిపి దాదాపు 1,03,100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ప్రతి 100 మందిలో నాలుగుగురికే సీట్లు దక్కే అవకాశం ఉంది.

మరిన్ని మార్పులతో, తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరం నుంచి కొత్త బీఏ కోర్సు, ‘డిఫెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్టడీస్’ ప్రారంభమవుతుంది. ఈ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ బాలకిష్టారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సిలబస్‌ తయారీ పనులు జరుగుతున్నాయి , దరఖాస్తులు త్వరలో కాలేజీల నుంచి ఆహ్వానించబడతాయని ఆయన చెప్పారు. రక్షణ రంగంలో పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు ఉన్నందున ఈ కోర్సును ప్రవేశపెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Priyanka Chopra : చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంక చోప్రా


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2025
  • Defense and Security Studies
  • entrance exam
  • IIT
  • JEE main
  • new BA course
  • NIT
  • telangana
  • telangana education

Related News

IMD Alert

Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

తెలంగాణ రాష్ట్రంలో జూన్ 27 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ కేంద్రం హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐఎమ్‌డీ తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ అలర్ట్ శనివారం వరకు అమల్లో ఉండనుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసర

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

  • ఈ గొప్పల దండకం ఇక చాలు.. కేటీఆర్, బీఆర్ఎస్‌లు ఈ వాస్తవాలు తనిఖీ చేసుకోవాలి !

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd