HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Is Bjp In Favor Of Caste Census Isnt It Minister Ponnam Prabhakar

Caste Census : కులగణనకు బీజేపీ అనుకూలమా? కాదా? : మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్

Caste Census : బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా మతం రంగును పూసిందని ఆరోపించారు. లక్ష్మణ్ మీద గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

  • Author : Latha Suma Date : 09-11-2024 - 4:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Minister Ponnam
Minister Ponnam

Ponnam prabhakar : ఈరోజు నుండి తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సమావేశంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కులగణనకు బీజేపీ అనుకూలమా కాదా ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశవ్యాప్తంగా సర్వే చేసేందుకు కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తావా లేదా అని నిలదీశారు. తెలంగాణలో సర్వేపై లక్ష్మణ్ అభిప్రాయం చెప్పాలని ప్రశ్నించారు. ఎన్నికల కోసం కులగణన జరుపుతున్నామని అంటున్నారని అన్నారు. సర్వేను అడ్డుకోవాలని చూస్తే లక్ష్మణ్ ద్రోహిగా మిగిలిపోతారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలా వద్దా అని నిలదీశారు. బీజేపీ ఎన్నికల్లో పూర్తిగా మతం రంగును పూసిందని ఆరోపించారు. లక్ష్మణ్ మీద గౌరవం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నారని అన్నారు. బలహీన వర్గాలను అవమానించే విధంగా లక్ష్మణ్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమన్నారు.

బలహీన వర్గాలకు చెందిన మోడీ, వారి అనుచరుల కోసం పదేళ్లలో ఏమైనా చేశారా చెప్పాలి. తెలంగాణలో బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీసీ అధ్యక్షుడిని తీసేశారు. సివిల్ సొసైటీలో అందరి అబిప్రాయం తీసుకొని కులగణన చేస్తున్నాం. కులగణనకు అడ్డం పడటానికి బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తుంది. బీజేపీ నేతల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రాజస్థాన్‌లో రిజర్వేషన్ అమలు చేస్తుంటే హేమంత్ సొరేన్‌ను అరెస్ట్ చేశారు. వీపీ సింగ్ రిజర్వేషన్లు తెస్తే కమండలం పేరు మీద పదవి ఊడబీకారు.ప్రభుత్వం ఏ డాక్యుమెంట్ అడగట్లేదు. సమాచారాన్ని ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. బీఆర్ఎస్ సర్వే చేపట్టలేక పోయింది. మేము చేస్తున్నాం సహకరించండి. మూసీ పరివాహక ప్రాంత ప్రజల జీవన విధానం మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రక్షాళన చేస్తున్నారు. మీరు చేయలేని ప్రక్షాళన మేము చేస్తున్నాం సహకరించండి. వీలయితే సపోర్ట్ చేయాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.

కేటీఆర్‌ని పామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేయట్లేదని బండి సంజయ్ అంటున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని మేము అరెస్ట్ చేయం. కేటీఆర్ , కేసీఆర్, హరీష్ రావులను అరెస్ట్ చేస్తామని మేము అనలేదు. పదేళ్లు అధికారంలో ఉండి ఢిల్లీలో దోస్తీ గాలిలో కుస్తీ పట్టింది మీరు కాదా బండి సంజయ్. రాష్ట్ర ప్రయోజనాలకోసం రాబోయే పార్లమెంట్ సెషన్‌లో డిల్లీకి వెళ్లి కోట్లాడతాం. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములుగా ఉండక పోతే మీరు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు అని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అన్నట్లు కులగొట్టిన ప్రాంతాలకు వస్తాం. పదేళ్లు అధికారంలో ఉన్న వారు,వాళ్ల గ్యారంటీలు ఏమైనవి ముందుగా చెప్పాలి. కిషన్ రెడ్డి ఏవిధంగా హైదరాబాద్‌కు ఉపయోగ పడుతున్నారో టవర్ సర్కిల్ దగ్గర చర్చకు సిద్ధమా అంటే సప్పుడు చేయలేదు. జైలు కట్టినం కేసీఆర్ కుటుంబం అంతా జైలుకే అని బండి సంజయ్ అన్నారు.  ఇకపోతే..రాష్ట్రంలో 80 వేల మంది ఎన్యుమరేటర్లు, 10 వేల మంది అబ్జర్వర్లతో సమగ్ర కులగణన ప్రారంభమైంది. నవంబర్ 30వ తేదీ లోపు కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్కో ఎన్యుమరేటర్‌కు 150 నుంచి 175 ఇళ్ల బాధ్యతను అప్పగించారు. మొత్తం 56 అంశాలపై 75 ప్రశ్నలు రూపొందించారు.

Read Also: Holidays : 2025 సెలవుల జాబితా విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • caste census
  • congress
  • Ponnam Prabhakar
  • Rajya Sabha MP Laxman
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd