Illegal Sand : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సీఎం రేవంత్
అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.
- By Latha Suma Published Date - 03:59 PM, Mon - 17 February 25

Illegal Sand : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఓవర్ లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేపట్టాలన్నారు. అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు ఇచ్చారు.
Read Also: Ayodhya Ram Mandir: షిర్డీ, వైష్ణోదేవి ఆలయాలను దాటేసిన అయోధ్య రామమందిరం
ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్ తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రవాణకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంప్యానెల్ చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఇసుక అక్రమ రవాణ జోరుగా సాగుతున్నాయన్న ప్రచారంతో తాజాగా ముఖ్యమంత్రి ఈరోజు మరోసారి ఆదేశించారు. ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణకు అడ్డుకట్ట వేసే బాధ్యత జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించారు.
కాగా, సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో ఇసుక రవాణా, తవ్వకాల అంశంపై ఆయన కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సామాన్య వినియోగదారులకు తక్కువ ధరకే ఇసుక లభించేలా చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు. ఈ నెల 10న గనులు ఖనిజాభివృద్ధిపై సమీక్షించిన సీఎం అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Nara Lokesh In Maha Kumbh Mela: మహాకుంభమేళా ప్రయాగ్‌రాజ్‌లో నారా లోకేష్ దంపతులు.. కుమారుడితో సెల్ఫీ!