HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Invitation To Minister Of Religion Konda Surekha For Brahmotsavam

Telangana: బ్రహ్మోత్సవాలకు మంత్రి కొండా సురేఖకు ఆహ్వానం

నాగర్ కర్నూల్ జిల్లాలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకు అందజేశారు.

  • Author : Praveen Aluthuru Date : 12-06-2024 - 9:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana
Telangana

Telangana: నాగర్ కర్నూల్ జిల్లాలోని అతి ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఒకటైన శ్రీపురం శ్రీ రంగనాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖకు అందజేశారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు ఆలయ విశేషాలను వివరించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జూన్ 15న స్వామివారికి అభిషేకం, తిరుమంజనం, విశ్వక్సేన ఆరాధన, పుణ్య వచనం, రక్షాబంధనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, గరుడ ముద్ద, భేరీపూజ, దేవతాహ్వానం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. జూన్ 17న సాయంత్రం శ్రీ గోదా రంగనాథ స్వామి తిరు కల్యాణం, రహోత్సవం జరుగుతాయని, జూన్ 18న మహా పూర్ణాహుతి, చక్రస్నానం, దేవతోద్వాసనం, ద్వాదశారాధన, ధ్వజ అవరోహణం, కుంభ ప్రోక్షణ తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. పురాతన ఆలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు టివి మురళీధరాచార్యులు, వస్తల శ్రీధర్ రెడ్డి, సునీల్ రెడ్డి, నరేందర్ రెడ్డి ఉన్నారు. మల్లికార్జున్, విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Chandrababu : రేపు సాయంత్రం సీఎంగా చంద్రబాబు బాధ్యతలు..ఆ మూడు ఫైల్స్ సంతకం


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brahmotsavam
  • invitation
  • Konda Surekha
  • Nagarkurnool
  • Religion Minister
  • Sripuram Sri Ranganayaka Swamy
  • telangana

Related News

The Raja Saab

‘ది రాజా సాబ్’, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాల‌కు గుడ్ న్యూస్‌!

నిర్మాతల విన్నపంపై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. గతంలో తాము ఇచ్చిన స్టే ఉత్తర్వులు కేవలం ఆ సమయంలో విడుదలైన సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని కోర్టు స్పష్టతనిచ్చింది.

  • kcr rule

    కేసీఆర్ నమ్మించి తెలంగాణ ప్రజలగొంతు కోసాడా ? కవిత వ్యాఖ్యలు వింటే అలాగే అనిపిస్తుంది !!

  • Largest Steel Bridge hyderabad

    హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్ బ్రిడ్జి

  • CM Revanth Reddy to visit Medaram on 18th of this month

    ఈ నెల 18న మేడారంకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • CM Chandrababu On Krishna, Godavari River Water

    కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు

Latest News

  • విశాఖ తీరంలో మిస్సైల్ టెస్ట్!

  • అశ్లీల కంటెంట్ వివాదం, గ్రోక్ నివేదికపై కేంద్రం అసంతృప్తి!

  • సీసాలు వాళ్లవే…. స్క్రిప్ట్ వాళ్లదే….. తిరుమలలో వైసీపీ మద్యం డ్రామా!

  • సంక్రాంతి వేళ, APSRTC లో సమ్మె సైరన్ ?

  • అమరావతికి చట్టబద్ధత సాధ్యమేనా?

Trending News

    • డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 500 శాతం టారిఫ్‌లు.. ఆ బిల్లుకు గ్రీన్‌ సిగ్నల్‌

    • బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. భారత్‌లోనే వరల్డ్ కప్ ఆడాలని స్పష్టం!

    • పదేళ్ల తర్వాత పర్ఫెక్ట్ ‘ఫిబ్రవరి’ ఈసారి రాబోతుంది !!

    • భారత ఈ-పాస్‌పోర్ట్.. ఫీజు, దరఖాస్తు విధానం ఇదే!!

    • సచిన్ ఇంట పెళ్లి సంద‌డి.. త్వ‌ర‌లో మామ‌గా మార‌నున్న మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd