student suicide: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. కారణమిదే..?
ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, తోటి స్టూడెంట్స్ ముందు చులకన అవుతాననే భయంతో ఇంటర్ ఇంటర్ విద్యార్ధి సాయినిఖిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని లోని సంగారెడ్డి జిల్లాలోని మేళాసంగంలో జరిగింది.
- Author : Gopichand
Date : 19-10-2022 - 11:20 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంగ్లీష్ మీడియంలో పాఠాలు అర్థం కావడం లేదని, తోటి స్టూడెంట్స్ ముందు చులకన అవుతాననే భయంతో ఇంటర్ ఇంటర్ విద్యార్ధి సాయినిఖిల్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని లోని సంగారెడ్డి జిల్లాలోని మేళాసంగంలో జరిగింది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మేళాసంగంలో గ్రామానికి చెందిన బేగరి రాచయ్యకు ఏడుగురు సంతానంలో సాయినిఖిల్ (16) చిన్నవాడు. బుధేరాలోని జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివిన సాయినిఖిల్ ఇంటర్‌లో ఇంగ్లీష్ మీడియంలో చేరాడు.
అయితే తనకు ఇంగ్లీష్ అర్థం కావడం లేదని, మార్కులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయని, తోటి విద్యార్థుల ముందు చులకన అవుతున్నట్లు పలుమార్లు తండ్రితో చెప్పుకొని బాధపడ్డాడు. ఇటీవల కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చిన సాయినిఖిల్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్ర గాయాలైన అతడిని సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్సకోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ సాయినిఖిల్ మృతి చెందాడు.