HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Imd Issues Yellow Alert For Hyderabad

IMD issues: హైదరాబాద్ కు ‘ఎల్లో’ అలర్ట్!

హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో నగరంలో వారాంతపు వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.

  • Author : Balu J Date : 05-02-2022 - 1:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyderabad
Hyderabad

హైదరాబాద్ లో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో నగరంలో వారాంతపు వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ నాలుగు రోజులపాటు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలో సగటు రాత్రి ఉష్ణోగ్రత 19.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కుతుబుల్లాపూర్, దాని పరిసర ప్రాంతాలలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 14.2 డిగ్రీల సెల్సియస్, ఆ తర్వాత పటాన్‌చెరులో రాత్రి ఉష్ణోగ్రత 16.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా ప్రకారం గాజులరామారం, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్, ఎల్‌బీ నగర్, సికింద్రాబాద్, ఉప్పల్, చార్మినార్ సహా పలు ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో రాత్రి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గే అవకాశం ఉంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వారాంతంలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్‌, మంచిర్యాలు, జయశంకర్‌ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌ కంటే తగ్గే అవకాశం ఉందని అంచనా.

హైదరాబాద్

కుతుబుల్లాపూర్: 14.2 డిగ్రీల సెల్సియస్

పటాన్చెరు: 16.6 డిగ్రీల సెల్సియస్

గాజులరామారం: 18 డిగ్రీల సెల్సియస్

కూకట్‌పల్లి: 18.3 డిగ్రీల సెల్సియస్‌

రాజేంద్రనగర్: 18.6 డిగ్రీల సెల్సియస్

ఇతర జిలాల్లో..

వికారాబాద్: 11.3 డిగ్రీల సెల్సియస్

సంగారెడ్డి: 12.0 డిగ్రీల సెల్సియస్

ఆదిలాబాద్: 12.3 డిగ్రీల సెల్సియస్

కామారెడ్డి: 12.3 డిగ్రీల సెల్సియస్

నిజామాబాద్: 12.3 డిగ్రీల సెల్సియస్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • IMD
  • warns
  • yellow alert

Related News

Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్

  • Southwest monsoon spreading across Telangana.

    IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd