HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >If Hyderabad Wants To Remain Peaceful Make Bjp Win Etela

MLC POll : హైదరాబాద్‌‌ ప్రశాంతంగా ఉండాలంటే బిజెపిని గెలిపించండి – ఈటెల

MLC POll : ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం కంట్రోల్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. మోదీ ప్రధానమంత్రి కాకముందు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నా, ఇప్పుడు ఉగ్రవాదులు దేశం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతున్నారని

  • Author : Sudheer Date : 21-04-2025 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Etela Hydra
Etela Hydra

హైదరాబాద్‌లో శాంతియుత వాతావరణం నెలకొనాలంటే బీజేపీ అభ్యర్థిని గెలిపించాల్సిందేనని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయంలో సోమవారం (ఏప్రిల్ 21న) మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఉగ్రవాదం కంట్రోల్‌లోకి వచ్చిందని పేర్కొన్నారు. మోదీ ప్రధానమంత్రి కాకముందు దేశంలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నా, ఇప్పుడు ఉగ్రవాదులు దేశం వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడుతున్నారని ఈటల చెప్పారు.

Raj Kasireddy: ఏపీ మ‌ద్యం కుంభ‌కోణంలో ప్ర‌ధాన నిందితుడు క‌సిరెడ్డి అరెస్ట్‌!

నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ సిటీలుగా మారే ప్రగతి జరుగుతోందని ఈటల వివరించారు. అమృత్ నగరాలు, మోడర్న్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు. హైదరాబాద్‌లో కూడా ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమని వివరించారు.

హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి ఓటు వేయడం వల్ల శాంతిభద్రతలు దెబ్బతింటాయని, అభివృద్ధి కూడా అడ్డుకుపోతుందని ఈటల రాజేందర్ ఆరోపించారు. “ఎంఐఎం పార్టీకి ఓటు వేయడం అంటే మన చేతులతో మన కంట్లోనే పొడుచుకున్నట్లుగా అవుతుంది” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటు వేసే ముందు ఓటర్లు సరిగా ఆలోచించాలన్నారు. హైదరాబాద్ నగరానికి భవిష్యత్తు రూపుదిద్దాలంటే బీజేపీకి మద్దతు అవసరమని పిలుపునిచ్చారు.

ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 112 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 81 మంది కార్పొరేటర్లు కాగా, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మెజారిటీ ఓట్లు ఉండగా, బీజేపీ రెండో స్థానంలో ఉంది. ఎన్నికల ఫలితాలు ఏప్రిల్ 25న వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు హైదరాబాద్ రాజకీయాల్లో కీలక మలుపును తీసుకురావచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AIMIM
  • bjp
  • hyderabad
  • MLC POll
  • MP Etela Rajendar

Related News

The Yellow Straw

The Yellow Straw : హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో “ది యెల్లో స్ట్రా” నాలుగో అవుట్‌లెట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ మహానగరంలోని ఐటీ హృదయస్థలిగా పిలువబడే హైటెక్ సిటీలో ఆరోగ్యకరమైన పానీయాలకు చిరునామాగా మారిన “ది యెల్లో స్ట్రా” (The Yellow Straw) తన నాలుగో అవుట్‌లెట్‌ను నాలెడ్జ్

  • Fire Accident in Jubilee Hills : జూబ్లీహిల్స్ షాపింగ్ మాల్లో భారీ అగ్ని ప్రమాదం

  • Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

    Gold Price Today Feb 26-2026: బంగారం ధరలు ఢమాల్..ఈరోజు భారీగా తగ్గిన ధర

  • Asus

    ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Hyd Real Estat

    Hyderabad Real Estate : హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో జెన్ జెడ్ విప్లవం

Latest News

  • భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ?

  • హీరో విజ‌య్‌కు ఎఫైర్‌.. విడాకులు కోరిన భార్య‌!?

  • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

  • రింకూ సింగ్ తండ్రి మృతికి కార‌ణ‌మైన లివర్ క్యాన్సర్‌.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

  • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

Trending News

    • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

    • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

    • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd