Gudem Mahipal Reddy : నేను బీఆర్ఎస్లోనే ఉన్నా – షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే
Gudem Mahipal Reddy : తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఏ నాయకుడిని అయినా కలవడం సర్వసాధారణమని, దీనిని రాజకీయం చేయడం అసత్య ప్రచారానికి ఉదాహరణగా పేర్కొన్నారు
- By Sudheer Published Date - 08:16 AM, Thu - 20 March 25

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Gudem Mahipal Reddy) పార్టీ మారలేదని, తాను ఇప్పటికీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) లోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) కలవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భేటీని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Tomato Benefits: టమాటాలు అధికంగా తింటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే!
తాను ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యత్వ రుసుము రూ. 5,000 చెల్లిస్తున్నట్లు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడం తప్పేమీ కాదని, దీన్ని తనపై రాజకీయంగా దుష్ప్రచారం చేయడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాను బీఆర్ఎస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తున్నానని, పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో కూడా మహిపాల్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేశారు. తనను అనర్హుడిగా ప్రకటించాలన్న విజ్ఞప్తి చట్టపరంగా చెల్లుబాటు కాదని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి కోసం ఏ నాయకుడిని అయినా కలవడం సర్వసాధారణమని, దీనిని రాజకీయం చేయడం అసత్య ప్రచారానికి ఉదాహరణగా పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.