HYDRA : హైడ్రా దెబ్బకు భాగ్యనగరంలో తగ్గిన భూములు, ఆస్తుల కొనుగోళ్లు..!
HYDRA : గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి రూ. 955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం రూ. 650కోట్లకే పరిమితమైంది
- By Sudheer Published Date - 08:06 AM, Mon - 7 October 24

నీటి వనరుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ (Hydraa) ..ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపెట్టింది. హైడ్రా కు ముందు వరకు కూడా సామాన్య ప్రజల దగ్గరి నుండి కోటీశ్వరుల వరకు అందరి చూపు హైదరాబాద్ పైనే ఉండేది. హైదరాబాద్ లో ఓ చిన్న వ్యాపారమైనా పెట్టాలని , ఓ చిన్న ఇల్లైయాన్ కట్టుకోవాలని , హైదరాబాద్ (Hyderabad) లో ఉండాలని ఇలా అనేక మంది కోరుకునే వారు. ఎక్కడెక్కడో ఉన్న వారంతా అక్కడ తమ ఆస్తులను అమ్ముకొని హైదరాబాద్ లో సెటిల్ అవుతామని వచ్చేవారు..వచ్చేందుకు ఆలోచించే వారు. తమ పిల్లల చదువుల కోసం కొంతమంది..బ్రతుకు దెరువు కోసం కొంతమంది..ఏదైనా లైఫ్ లో సాధించాలని ఇంకొంతమంది ఇలా కారణం ఏదైనా సరే హైదరాబాద్ వైపే ముందుకు చూసేవారు. అలాంటి హైదరాబాద్ హైడ్రా దెబ్బకు కుదేల్ అయ్యింది. పదేళ్లు గా ఎంతగానో అభివృద్ధి చెందుతూ వచ్చిన భాగ్యనగరం..హైడ్రా రంగంలోకి దిగిన తర్వాత అంత అతలాకుతమైంది.
నీటి వనరుల పరిరక్షణకు ప్రభుత్వం తీసుకొచ్చిన ‘హైడ్రా’ కూల్చివేతల ప్రభావం రాష్ట్రంలోని భూములు, ఆస్తుల కొనుగోళ్లపై పడింది. ముఖ్యంగా హైదరాబాద్ లో అన్ని అనుమతులు ఉన్న ఇళ్లను సైతం హైడ్రా అధికారులు కూల్చేసరికి కొత్తగా కొనుగోలు చేయాలనుకునే వారికీ భయం పట్టుకుంది. అన్ని అనుమతుల్న వాటినే కూల్చేశారంటే..అసలు హైదరాబాద్ లో ఎక్కడ ల్యాండ్ సేఫ్ అనేది అర్ధం కానీ పరిస్థితి ఏర్పడింది. బిల్డర్స్ తమ స్వలాభమ్ కోసం కస్టమర్లకు మాయ మాటలు చెప్పి అంటకడుతున్నారని , వారి మాయలో పడి ఇల్లులు కొనుగోలు చేస్తే మొదటికే మోసం వస్తుందని అంత భవిస్తూ..కొద్దీ రోజులు ఇళ్ల జోలికి వెళ్లోద్దని డిసైడ్ అవుతున్నారు. దీంతో నగరంలో ఇళ్ల కోలుగోళ్లు భారీగా పడిపోయాయి. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు ఈ హైడ్రా ప్రభావం రాష్ట్రం మొత్తం మీద పడింది. దీంతో రిజిస్ట్రేషన్ ఆదాయం భారీగా పడిపోయింది.
ఒక్క సెప్టెంబర్ లోనే రిజిస్ట్రేషన్ ఆదాయం 30% తగ్గినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది సెప్టెంబర్లో దాదాపు లక్ష లావాదేవీలు జరిగి రూ. 955కోట్ల రాబడి రాగా ఈ సెప్టెంబర్లో లావాదేవీలు 80వేలకు పడిపోయి రాబడి సైతం రూ. 650కోట్లకే పరిమితమైంది. హైదరాబాద్, పరిసర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. మరి ముందు ముందు ఇంకెలా ఉంటుందో చూడాలి.
Read Also : CM Chandrababu Naidu: నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ!