Hydra : హైడ్రా కూల్చివేతలు.. కమిషనర్ రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంపు
హైదరాబాద్‌లోనే కాదు తెలంగాణలో కూడా ప్రస్తుతం ఎక్కడ చూసినా హైడ్రా పేరే వినిపిస్తోంది. అక్రమ కట్టడాలు, చెరువుల ఆక్రమణపై ఉక్కుపాదం మోపిన హైడ్రా..
- By Latha Suma Published Date - 12:51 PM, Tue - 27 August 24

Commissioner Ranganath: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్’) పెను సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ పరిధిలో వివిధ చెరువులను, నాలాలు, కుంటలను, ప్రభుత్వ, ఎండోమెంట్ భూములను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. అక్రమంగా నిర్మించిన భవనం, కట్టడం ఎవరిదనే విషయం పట్టించుకోకుండా హైడ్రా ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో పలువరు హైడ్రా కు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం..
We’re now on WhatsApp. Click to Join.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి భద్రత పెంచింది. మధుర నగర్‌లో ఉన్న కమిషనర్ ఇంటి దగ్గర భద్రతను కట్టుదిట్టం చేసింది. ఇందులో భాగంగా.. కమిషనర్ రంగనాథ్ నివాసం దగ్గర ఔట్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కాగా నగరంలో ఇటీవల హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలు కూల్చివేతలు చేపట్టిన నేపథ్యంలో హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాథ కు ముప్పు పొంచి ఉండటంతో ఈ భద్రత ఏర్పాటు చేశారు.
కాగ, ఇటీవల సినీనటుడు నాగార్జునకు సంబంధించిన ఎన్- కన్వెన్షన్ కూల్చివేత తర్వాత బడా రాజకీయ నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలను తొలగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం రంగనాథ్ ఇంటి వద్ద భద్రత పెంచినట్లు తెలుస్తోంది.
Read Also: Bairanpally : బైరాన్‌పల్లిలో రజాకార్ల నరమేధానికి నేటితో 76 ఏళ్లు