HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hyderabads Necklace Road Turns Colourful As 3000 Women Join Taneira Saree Run

Saree Run : నెక్లెస్ రోడ్‌‌ కళకళ.. కలర్‌ఫుల్‌గా వేలాది మంది ‘సారీ రన్’

చీరలు ధరించినా, ఫిట్‌నెస్ విషయంలో మహిళలు రాజీపడకూడదు అనే గొప్ప సందేశాన్ని వాళ్లు ‘తనీరా సారీ రన్’(Saree Run) కార్యక్రమం ద్వారా ఇచ్చారు. 

  • Author : Pasha Date : 23-02-2025 - 6:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Taneira Saree Run Hyderabad Necklace Road Hyderabad Women Min

Saree Run : హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్‌‌లో ఉన్న పీపుల్స్ ప్లాజా ఒక్కసారిగా రంగులమయంగా మారింది. అక్కడికి ఏకంగా 3,120 మంది మహిళలు వివిధ రంగుల చీరలు ధరించి తరలివచ్చారు.  వారంతా మన దేశంలోని విభిన్న చేనేత కళలతో తయారు చేసిన చీరలను ధరించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భాగ్య నగరంలోని ఈ మహిళలంతా వివిధ నేపథ్యాలకు చెందినవారు. కొందరు వ్యాపారులైతే, ఇంకొందరు ఉద్యోగులు. అయినా అందరూ కలిసిమెలిసి రన్ చేశారు. మహిళలకూ ఫిట్‌నెస్ అవసరమని చాటి చెప్పారు. చీరలు ధరించినా, ఫిట్‌నెస్ విషయంలో మహిళలు రాజీపడకూడదు అనే గొప్ప సందేశాన్ని వాళ్లు ‘తనీరా సారీ రన్’(Saree Run) కార్యక్రమం ద్వారా ఇచ్చారు.

Also Read :Final Wish: ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక.. భారత్‌లో ఏం చేశారో తెలుసా ?

సాంస్కృతిక వారసత్వం వర్సెస్ ఆధునిక జీవనశైలి

తనీరా అనేది టాటా గ్రూపునకు చెందిన వస్త్ర బ్రాండ్. జేజే యాక్టివ్ అనేది బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే  ఫిట్‌నెస్ కంపెనీ. ఇవి రెండూ సంయుక్తంగా  ‘తనీరా సారీ  రన్’ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో కలర్ ఫుల్‌గా, జోష్ ఫుల్‌గా నిర్వహించాయి. తనీరా సీఈఓ అంబుజ్ నారాయణ్, జేజే యాక్టివ్ నుంచి ఫిట్‌నెస్ కోచ్ ప్రమోద్‌లు  జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గతంలో ఇలాంటి కార్యక్రమాన్ని బెంగళూరు, పూణే, అహ్మదాబాద్, చెన్నై వంటి నగరాల్లో నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాలు సాంస్కృతిక వారసత్వం, ఆధునిక జీవనశైలి మధ్య సమతుల్యతను ప్రోత్సహిస్తాయి. మహిళలు తమ దినచర్యలో ఫిట్‌నెస్‌ను ఒక భాగంగా మార్చాలనే దిశగా ప్రోత్సాహాన్ని అందిస్తాయి.

Also Read :Raja Rithvik : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రిత్విక్‌‌కు కాంస్యం.. నేపథ్యం ఇదీ..

ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి

‘‘తనీరా సారీ రన్ మహిళల ఆధునిక శక్తిని ప్రదర్శించింది.  ఎంతోమంది ఇతర మహిళలకు స్ఫూర్తిని పంచింది. ఫిట్‌నెస్‌కు వారిని దగ్గర చేసింది. మేం కోరుకున్నది కూడా అదే’’ అని  తనీరా సీఈఓ అంబుజ్ నారాయణ్ తెలిపారు.

మహిళలూ ఫిట్‌నెస్‌‌ను విస్మరించొద్దు 

‘‘మహిళలు నిత్యం తమ కుటుంబ శ్రేయస్సు గురించే ఆలోచిస్తుంటారు. ఈక్రమంలో సొంత ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అందుకే మహిళలూ ఫిట్‌నెస్‌పై కొంతైనా శ్రద్ధ పెట్టాలి. ఆ విషయాన్ని చాటిచెప్పేందుకు సారీ రన్ నిర్వహించాం’’ అని జేజే యాక్టివ్ కంపెనీకి చెందిన ఫిట్‌నెస్ కోచ్ ప్రమోద్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Hyderabad Women
  • Necklace Road
  • Saree Run
  • Taneira Saree Run

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd