Final Wish: ఆస్ట్రేలియా వ్యక్తి చివరి కోరిక.. భారత్‌లో ఏం చేశారో తెలుసా ?
భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పాలించిన సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ సామ్స్(Final Wish) తండ్రి అస్సాంలో డ్యూటీ చేశారు.
- By Pasha Published Date - 04:59 PM, Sun - 23 February 25

Final Wish: ఆయనది ఆస్ట్రేలియా. అయితేనేం భారతగడ్డపై మమకారాన్ని పెంచుకున్నారు. చనిపోయే ముందు రాసిన వీలునామాలో ఈవిషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. తన భౌతిక కాయాన్ని భారత్‌లోనే ఖననం చేయాలని కోరారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ వాస్తవ్యుడు 91 ఏళ్ల డొనాల్డ్ సామ్స్ చివరి కోరిక ఇదే. దీన్ని ఆయన భార్య ఆలిస్ సామ్స్ నెరవేర్చారు.
Also Read :Raja Rithvik : తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రిత్విక్‌కు కాంస్యం.. నేపథ్యం ఇదీ..
డొనాల్డ్ సామ్స్ కుటుంబానికి భారత్‌తో అనుబంధం
- భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్లు పాలించిన సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన డొనాల్డ్ సామ్స్(Final Wish) తండ్రి అస్సాంలో డ్యూటీ చేశారు.
- అందుకే డొనాల్డ్ సామ్స్ భారత్‌కు వచ్చినప్పుడల్లా తన తండ్రికి నివాళిగా అస్సాంను సందర్శించేవారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నుంచి బిహార్‌లోని పాట్నా దాకా గంగా నదిలో బోటులో ప్రయాణించే వారు.
- ఆస్ట్రేలియన్ హైకమాండ్ అధికారిగా విధులు నిర్వర్తించి ఆయన ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు.
- 12వసారి భారత్‌ను సందర్శించేందుకు ఇటీవలే డొనాల్డ్ భార్యతో కలిసి భారత్‌కు వచ్చారు. ప్రస్తుతం ఆయన వయసు 91 ఏళ్లు.
- ఈసారి డొనాల్డ్ సామ్స్ టూర్‌లో ఆయన భార్య ఆలిస్ సామ్స్, మరో 42 మంది పర్యాటకులు ఉన్నారు.
- ఈసారి కూడా అస్సాంను డొనాల్డ్ సందర్శించారు. కోల్‌కతా నుంచి పాట్నాకు గంగా నది ద్వారా క్రూయిజ్‌లో ప్రయాణించారు.
- ఫిబ్రవరి 21వ తేదీన బోటులో ఉండగా డొనాల్డ్ ఆరోగ్యం క్షిణించింది. దీంతో ముంగేర్‌లోని కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మరణించారు.
- తన మృతదేహాన్ని భారత్‌లోని శ్మశాన వాటికలోనే ఖననం చేయాలని చివరి కోరికగా డొనాల్డ్ వీలునామాలో రాసుకున్నారు. భారత్‌తో ఉన్న ప్రత్యేక అనుబంధం వల్లే ఇలా రాశారు.
- డొనాల్డ్ సామ్స్ చనిపోయాక, ఆ విషయాన్ని భారత విదేశాంగ శాఖ యంత్రాంగం, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి ముంగేర్ జిల్లా అధికారులు తెలియజేశారు. తన భర్త వీలునామాలోని చివరి కోరికను నెరవేర్చేందుకు సహకరించాలని భార్య ఆలిస్ సామ్స్ భారత్‌లోని ఆస్ట్రేలియా ఎంబసీని కోరింది. అందుకు ఎంబసీ అనుమతి ఇచ్చింది.
- ముంగేర్ జిల్లా అధికార యంత్రాంగమే డొనాల్డ్ సామ్స్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసింది.
- బిహార్‌లోని చురంబాలో ఉన్న క్రైస్తవ స్మశానవాటికలో డొనాల్డ్ సామ్స్ మృతదేహాన్ని క్రైస్తవ ఆచారాలతో ఖననం చేశారు.