Hyderabad Metro : మెట్రోకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ ఫైన్
2022 డిసెంబర్ 16న హఫీజ్‌పేట్ వెళ్లేందుకు.. దిల్‌సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్ వరకు మెట్రోలో ప్రయాణించారు. మలక్ పేట మెట్ర స్టేషన్‌లో 9.45 గంటలకు ట్రైన్ దిగారు
- Author : Sudheer
Date : 21-10-2023 - 8:36 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) షాక్ ఇచ్చింది హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ (Hyderabad Consumer Commission). మెట్రో స్టేషన్‌లో తప్పుడు సైన్ బోర్డులు (Metro Sign Board) ఏర్పాటు చేయటంతో ఓ ప్రయాణికుడికి అసౌకర్యం కలగ్గా.. అతడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. ఈ మేరకు ఫిర్యాదును విచారించిన కమిషన్ హైదరాబాద్ మెట్రో సంస్థకు మొట్టికాయలు వేసింది. ఫిర్యాదీకి రూ.5వేల పరిహారం, కేసు ఖర్చులు రూ.1,000 చెల్లించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే…
న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్న సైదాబాద్‌కు చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ (Sheikh Abdul Qadir).. 2022 డిసెంబర్ 16న హఫీజ్‌పేట్ వెళ్లేందుకు.. దిల్‌సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్ వరకు మెట్రోలో ప్రయాణించారు. మలక్ పేట మెట్ర స్టేషన్‌లో 9.45 గంటలకు ట్రైన్ దిగారు. మలక్‌పేట్ రైల్వే స్టేషన్‌కు త్వరగా చేరుకోవాలని అక్కడ సైన్ బోర్డులను ( దిక్కుల సూచిక బోర్డు) అనుసరిస్తూ కౌంటర్ వద్ద మెట్రో కార్డును ట్యాప్ చేశారు. కొద్ది దూరం వెళ్లి పరిశీలించగా.. రైల్వేస్టేషన్ మార్గం మరోవైపు ఉంది. తప్పుడు సైన్ బోర్డుతో ఖాదర్ గందరగోళానికి గురయ్యారు. మెట్రోస్టేషన్‌లో ఏర్పాటు చేసిన మూడు సైన్ బోర్డులు తప్పుడు దిక్కులు సూచిస్తున్నాయని గుర్తించాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే విషయాన్ని అక్కడి కౌంటర్‌లో ఉన్న సిబ్బందిని అడగ్గా.. వారి నుంచి సరైన స్పందన లేకుండా పోయింది. పైగా.. కార్డు ట్యాప్ చేసిన తర్వాత అటువైపు వెళ్లేందుకు అతడిని అనుమతించ లేదు. దీంతో అసహనానికి గురైన ఖాదర్.. హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. విచారించిన కమిషన్ మెట్రోకు రూ. 6 వేల ఫైన్ విధించింది. అలాగే మెట్రోస్టేషన్‌లో సరైన సూచిక బోర్డులు 30 రోజుల్లో ఏర్పాటు చేయాలని చెప్పింది. పరిహారం, కేసులు ఖర్చులు 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.
Read Also : Hyderabad: కిక్కిరిసిపోయిన హైదరాబాద్ రైల్వే స్టేషన్లు, బస్టాప్‌లు