Terrible : గర్భవతైన భార్యను ముక్కలుగా నరికిన కిరాతకుడు
Terrible : హత్య చేసిన తర్వాత, మహేందర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మృతదేహం తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని ఒక కవర్‌లో ప్యాక్ చేసి గదిలోనే ఉంచాడు.
- Author : Sudheer
Date : 24-08-2025 - 9:56 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్‌లోని బోడుప్పల్, మేడిపల్లిలో గల బాలాజీ హిల్స్ లో దారుణమైన సంఘటన జరిగింది. గర్భవతి అయిన భార్యను ఆమె భర్తే అతి కిరాతకంగా హత్య చేశాడు. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు చెందిన స్వాతి (22), మహేందర్ ప్రేమ వివాహం చేసుకుని కొంత కాలంగా బోడుప్పల్‌లో నివసిస్తున్నారు. అయితే, శనివారం మధ్యాహ్నం మహేందర్ తన భార్య స్వాతిని చంపినట్లు సమాచారం. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను కలిగించింది.
Rich Cricketer: సంపాదనలో సచినే టాప్.. ఆ తర్వాతే కోహ్లీ, ధోనీ!
హత్య చేసిన తర్వాత, మహేందర్ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. మృతదేహం తల, కాళ్లు, చేతులను వేరు చేసి మూసీ నదిలో పడేశాడు. మిగిలిన మొండాన్ని ఒక కవర్‌లో ప్యాక్ చేసి గదిలోనే ఉంచాడు. దీనిని ఎక్కడికి తరలించలేని పరిస్థితి ఉండటంతో, అతను ఆ స్థితిలోనే గదిలో వదిలేశాడు. ఈ విషయం బయటపడకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. అయితే అతని ప్లాన్ విఫలమైంది.
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
ఈ దారుణానికి పాల్పడిన తర్వాత మహేందర్ తన భార్య స్వాతి ఆత్మహత్య చేసుకుందని ఆమె సోదరికి ఫోన్ చేసి చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన స్వాతి కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు మహేందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది.