TG High Court : నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు విచారణ
TG High Court : సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అసెంబ్లీ కార్యదర్శి. అప్పీల్‌లో పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 12:18 PM, Mon - 11 November 24

MLAs Disqualification Petition : తెలంగాణ హైకోర్టులో ఈరోజు (సోమవారం) ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ జరుగనుంది. కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిలు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్లు వేశారు. దీంతో ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టనుంది. సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అసెంబ్లీ కార్యదర్శి. అప్పీల్‌లో పేర్కొన్నారు.
అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ నేతలు పిటీషన్‌లో కోరారు. అప్పీల్‌పై ఈరోజు మరోసారి సీజే ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ తరఫున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించనున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.
ఇకపోతే.. సుప్రీంకోర్టు తీర్పుతో పాటు పలు రాష్ట్రాల్లోని న్యాయస్థానాల తీర్పులను, ఫిరాయింపు చట్టం నిబంధనలను కోర్టు దృష్టికి బీఆర్ఎస్ నేతలు తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. పలు దఫాలుగా వాదనలు విన్నది. ఈ కేసులో హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందోనని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. ఈ తీర్పుపై అటు కాంగ్రెస్ ఇటు బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని ఆదేశించింది న్యాయస్థానం. మరి స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
Read Also: Tunnel Under Cemetery : సమాధుల కింద రహస్య సొరంగం.. భారీగా ఆయుధాలు