Revanth Reddy: రేవంత్ రెడ్డి భద్రతపై ఆదేశాలు జారీ!
రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేపడుతున్నది తెలిసిందే. తన పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
- Author : Maheswara Rao Nadella
Date : 06-03-2023 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్ర చేపడుతున్నది తెలిసిందే. తన పాదయాత్రకు అదనపు భద్రత కల్పించాలంటూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. భద్రతపై ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తనకు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత కేవలం ట్రాఫిక్ నియంత్రణకే సరిపోతోందని తెలిపారు. అదనపు భద్రత తప్పనిసరి అని రేవంత్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
ఈ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు లో నేడు విచారణ జరిగింది . రేవంత్ రెడ్డికి (Revanth Reddy) అదనపు భద్రత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, రేవంత్ రెడ్డి భద్రతపై అన్ని జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వం తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీజీపీ ఆదేశాల ఫాక్స్ సందేశం ప్రతిని కోర్టుకు సమర్పించారు.
Also Read: Atmasakshi Survey: ఆత్మసాక్షి సంచలన సర్వే, సగం కాబినెట్ ఓటమి, అధికారంలోకి టీడీపీ