Singareni Elections : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
- Author : Sudheer
Date : 21-12-2023 - 1:59 IST
Published By : Hashtagu Telugu Desk
సింగరేణి ఎన్నికలకు (Singareni Elections) తెలంగాణ హైకోర్టు గ్రీన్ (Telangana High Court) సిగ్నల్ ఇచ్చింది. ఈనెల 27న ఎన్నికలను నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రభుత్వం చేసిన దాఖలు పిటిషన్ ను కోర్ట్ కొట్టి వేసింది. దీంతో డిసెంబర్ 27 న యధావిధిగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని గత ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. దీంతో డిసెంబర్ 27న ఎన్నికలు నిర్వహించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎన్నికలపై అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్న సమయంలో ప్రస్తుత ప్రభుత్వం మరో పిటిషన్ వేసింది. ఎన్నికలను మరోసారి వాయిదా వేయాలని కోరింది. ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదని, అడ్మినిస్ర్టేటివ్, శాంతిభద్రతల పరమైన ఇబ్బందులు ఉన్నాయని, ఎన్నికలకు మరింత గడువు కావాలని, మార్చి తర్వాత నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని కాంగ్రెస్ సర్కార్ హైకోర్టులో పిటిషన్ వేసింది.
ప్రభుత్వం వేసిన పిటిషన్ ను డిసెంబర్ 18న విచారించిన హైకోర్టు ..తదుపరి విచారణను డిసెంబర్ 21కి వాయిదా వేసింది. ఇవాళ విచారించిన హైకోర్టు ప్రభుత్వం వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో షెడ్యూల్ ప్రకారమే డిసెంబర్ 27న యథావిధంగా సింగరేణి ఎన్నికలు జరగనున్నాయి.
Read Also : CISF – Parliament : పార్లమెంట్ భద్రత బాధ్యత సీఐఎస్ఎఫ్‌కు