BRS MP Parthasarathy : బీఆర్ఎస్ ఎంపీ పార్థసారథి రెడ్డికి షాకిచ్చిన హైకోర్టు..
సాయి సింధు ఫౌండేషన్(Sai Sindhu Foundation) కు భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి(Cancer Hospital) నిర్మాణంకోసం సాయి సింధు ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన విషయం విధితమే.
- Author : News Desk
Date : 05-06-2023 - 11:00 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్ఎస్(BRS) రాజ్యసభ సభ్యుడు పార్థసారథి(MP Parthasarathy) రెడ్డికి హైకోర్టు(High Court) షాకిచ్చింది. సాయి సింధు ఫౌండేషన్(Sai Sindhu Foundation) కు భూ కేటాయింపును హైకోర్టు రద్దు చేసింది. క్యాన్సర్ ఆసుపత్రి(Cancer Hospital) నిర్మాణంకోసం సాయి సింధు ఫౌండేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించిన విషయం విధితమే. సాయి సింధు ఫౌండేషన్ కు ఖానామెట్ వద్ద 2018లో 15ఎకరాలు ప్రభుత్వం కేటాయించింది. సాయి సింధు ఫౌండేషన్ కు హెటిరో చైర్మన్ పార్థసారథి రెడ్డి మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నారు. జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో 2019లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. రైట్ సొసైటీ ఊర్మిళ, సురేష్ కుమార్లు హైకోర్టులో పిల్స్ దాఖలు చేశారు.
సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపు వల్ల ప్రభుత్వానికి సుమారు రూ.5436 కోట్ల నష్టమని, ప్రభుత్వ చర్య ప్రజాధనానికి తీవ్ర నష్టం చేసి విలువైన భూమిని ప్రైవేట్ సంస్థలకు కట్టబట్టడమేనని పిటీషన్ దారులు పేర్కొన్నారు. ప్రభుత్వ చర్య ఏకపక్షమే కాకుండా, పక్షపాతమేనని అన్నారు. పదెకరాలు ఇవ్వాలని కలెక్టర్ సిఫార్సు చేస్తే ప్రభుత్వం 15 ఎకరాలు ఇచ్చిందని, భూమి విలువ పెరిగేలా రోడ్డుకు ఉన్న ప్లాటు కూడా కేటాయించారని పిటీషన్ దారులు పేర్కొన్నారు.
పిల్స్ పై సోమవారం సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం తీర్పును వెలువరించింది. సాయి సింధు ఫౌండేషన్ కు భూ కేటాయింపు జీవోను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా పునః పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.
Also Read : Uttam Kumar Reddy : వచ్చే ఎన్నికల్లో హుజుర్‌నగర్ నుంచి మళ్ళీ పోటీ చేస్తా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్..