IPL Match: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లకు భారీ భద్రత, 2,800 పోలీసులతో నిఘా
- Author : Balu J
Date : 27-03-2024 - 9:52 IST
Published By : Hashtagu Telugu Desk
IPL Match: ఐపీఎల్ సందడి మొదలైన విషయం తెలిసిందే. మార్చి 27, ఏప్రిల్ 5 తేదీల్లో హైదరాబాద్ వేదికగా జరగనున్న ఐపీఎల్ టీ20 క్రికెట్ మ్యాచ్‌ల నేపథ్యంలో సిటీ పోలీసులు భద్రత, ఐపీఎల్ జట్ల కదలికలపై నిఘా పెట్టారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. రాచకొండ పోలీసులు, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, ఆర్మ్‌డ్ రిజర్వ్, ఆక్టోపస్, మౌంటెడ్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులతో పాటు 2,800 మంది సిబ్బందిని బందోబస్తులో ఉంచనున్నారు. అదనంగా, మ్యాచ్‌ల సమయంలో భద్రతను పెంపొందించడానికి 360 నిఘా కెమెరాలతో తనిఖీలు ఉంటాయి.
రాచకొండ పోలీస్ కమిషనర్, తరుణ్ జోషి మంగళవారం మాట్లాడుతూ.. ఐపీఎల్ భద్రత కోసం CCTV వీడియోను పర్యవేక్షించడానికి జాయింట్ కమాండ్, కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ప్రతి మ్యాచ్ పూర్తయ్యే వరకు భారీ భద్రత నిర్వహిస్తాం. మ్యాచ్ ప్రారంభం కొన్ని గంటల ముందుు నుంచే తనిఖీలు నిర్వహించబడతాయి’ అని తరుణ్ జోషి తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా మహిళలపై జరిగే వేధింపులు తనిఖీ చేయడానికి షీ టీమ్‌లను నియమించారు. ఏదైనా ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు, అంబులెన్స్‌లు స్టేడియంలో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read: Lord Shiva: శివుడి రూపమైన ఈ దేవుడికి పూజలు చేస్తే.. ఎన్నో ఆధ్యాత్మిక ప్రయోజనాలు