HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Heavy Rain In Hyderabad 5

Heavy Rains : హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం..ప‌లు ప్రాంతాల్లో నిలిచిన వ‌ర‌ద నీరు

హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్ల‌పై వ‌ర‌ద నీరు

  • Author : Prasad Date : 05-05-2023 - 7:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyd Rains
Hyd Rains

హైదరాబాద్ నగరంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్ల‌పై వ‌ర‌ద నీరు నిలిచిపోవ‌డంతో వాహనాల రాకపోకలకు ఆటంకం క‌లిగింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్‌గూడ, మణికొండ, టోలీచౌక్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అలాగే షేక్‌పేట, నార్సింగి, మెహిదీపట్నం, కూకట్‌పల్లి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే హైదరాబాద్‌లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని, బయటకు రావద్దని సూచించారు.

భారీ వర్షం కారణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు సహాయం కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశారు. ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 040-29555500లో సంప్రదించాలని అధికారులు సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. వడగళ్ల వాన, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం రైతులను అతలాకుతలం చేసింది. అకాల వర్షాల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని, అన్నదాతలకు లాభం లేకుండా పోయిందని చెబుతున్నారు.విదర్భ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం తెలంగాణ, కర్నాటక మీదుగా కొనసాగుతున్నందున మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 8 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Heavy Rain
  • hyderabad
  • rain
  • telangana

Related News

Heavy rains in Telangana... fresh warning for these districts.

Weather Report: తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు అందించింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో రాబోయే మరో వారం రోజుల పాటు వర్షాలు నిరంతరాయంగా కొనసాగనున్నట్లు భారత వాతావరణ శాఖ తన తాజా బులెటిన్‌లో స్పష్టం చేసింది. జూన్ 26 రాత్రి విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని మెజారిటీ ప్రాంతాల్లో తేలికపా

    Latest News

    • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

    • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

    • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

    • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

    • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd