HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Hca President Jagan Mohan Rao Exclusive Interview

HCA President: ఐపీఎల్‌కు హైదరాబాద్ సిద్ధం.. ప‌లు విష‌యాలు పంచుకున్న హెచ్‌సీఏ అధ్య‌క్షుడు!

మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్ప‌టిలాగే హైద‌రాబాద్‌లో కూడా జ‌ర‌గ‌నున్నాయి.

  • Author : Gopi Date : 19-02-2025 - 8:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
HCA President
HCA President

HCA President: టీమిండియా ప్ర‌స్తుతం ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీలో బిజీగా ఉంది. ఈరోజు నుంచి ప్రారంభమైన ఛాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ రేపు బంగ్లాదేశ్‌తో పోటీప‌డ‌నుంది. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రి 23న భార‌త్ పాక్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత బీసీసీఐ ఐపీఎల్ నిర్వ‌హించ‌నుంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్‌లు ఎప్ప‌టిలాగే హైద‌రాబాద్‌లో కూడా జ‌ర‌గ‌నున్నాయి. ఈసారి తొమ్మిది ఐపీఎల్ మ్యాచ్‌లు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్నాయి. తొలి మ్యాచ్ మార్చి 23న జ‌ర‌గ‌నుంది. అయితే ఈ సారి ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా హెచ్‌సీఏ (హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్‌) అని ర‌కాల ఏర్పాట్లు చేస్తోంది.

Also Read: Delhi Chief Minister: వీడిన ఉత్కంఠ‌.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా!

అయితే ఉప్ప‌ల్ స్టేడియంలోని ఏర్పాట్ల‌పై హెచ్‌సీఏ అధ్య‌క్షులు (HCA President) జ‌గ‌న్ మోహ‌న్ రావు ప‌లు విష‌యాల‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఐపీఎల్ అనేది మాకు ఒక పండ‌గ వాతావ‌ర‌ణం లాంటిది. పెళ్లితో పాటు స‌మానంగా ఐపీఎల్‌ను ట్రీట్ చేస్తాం. పెళ్లికి ముందు ఏవైతే ఏర్పాట్లు చేస్తామో, ఐపీఎల్‌కు కూడా అలాంటి ఏర్పాట్లే చేస్తాం. ఉప్ప‌ల్ స్టేడియంలో ఉన్న పెండింగ్ పనుల‌న్నీ మొద‌లుపెట్టాం. అయితే ఈసారి గ‌తంలో మాదిరిగా కాకుండా రెండు మ్యాచ్‌లు ఎక్కువ రావ‌డం జ‌రిగింది. తొమ్మిద మ్యాచ్‌లు ఈసారి జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 15 క‌ల్లా ఉప్ప‌ల్ స్టేడియాన్ని ఐపీఎల్ మ్యాచ్‌కు అన్ని ర‌కాల హంగుల‌తో అందుబాటులో ఉంచుతాం. మార్చి 20వ‌ర‌కు డెడ్ లైన్ పెట్టుకున్నాం. ఏమైనా చిన్న ప‌నులు ఉన్నా స‌రే వాటిని మార్చి 20లోపు క్లియ‌ర్ చేస్తాం. మార్చి 23కి మ‌న‌కు ఫ‌స్ట్ మ్యాచ్ ఉంది. అప్ప‌టివ‌ర‌కు స్టేడియంలో అన్ని ర‌కాల ఏర్పాట్ల‌ను చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాం. అలాగే తాను అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన స‌మ‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఒక విమ‌ర్శ కూడా త‌మపై రాలేద‌ని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు వ‌చ్చే క్రికెట్ అభిమానుల‌కు ఎలాంటి స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని ఆయ‌న తెలిపారు. మ‌రింత స‌మాచారం కోసం క్రింది వీడియో చూడండి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • HCA president
  • HCA President jagan mohan rao
  • hyderabad
  • IPL 2025
  • Jagan mohan Rao
  • sports news
  • SRH
  • Uppal stadium

Related News

Chris Gayle

కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

టీ20 క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రిస్ గేల్ ఇప్పుడు ఒక కొత్త జట్టుకు యజమాని అయ్యారు. 'యూనివర్స్ బాస్' యూరోపియన్ టీ20 లీగ్‌లో ఒక జట్టును కొనుగోలు చేశాడు.

  • Hyderabad Minor Girl instagram Trap Case

    డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

  • Jofra Archer

    షమీ రికార్డును సమం చేసిన ఆర్చర్!

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

Latest News

  • BRS : భారీ సైన్యం తో బిఆర్ఎస్ లో చేరిన జీవన్ రెడ్డి

  • రేప‌టితో ముగియ‌నున్న ఎన్నిక‌ల ప్ర‌చారం..!

  • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

  • కియా కారు.. రూ. 3.20 ల‌క్ష‌ల వ‌ర‌కు డిస్కౌంట్‌!

  • నిద్ర‌లేమి స‌మ‌స్య‌.. క‌ళ్ల‌పై ప్ర‌భావం?

Trending News

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd