Delhi Chief Minister: వీడిన ఉత్కంఠ.. ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా!
రేఖా గుప్తా 2009 నుంచి ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మార్చి 2010 నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా.
- By Gopichand Published Date - 08:25 PM, Wed - 19 February 25

Delhi Chief Minister: ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా పేరును (Delhi Chief Minister) ప్రకటించడంపై బీజేపీలో సంబరాలు మిన్నంటాయి. బీజేపీ కార్యకర్తలు పటాకులు పేల్చి మిఠాయిలు తినిపించి సంబరాలు చేసుకుంటున్నారు. రేఖా గుప్తా 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షాలిమార్ బాగ్ నుంచి గెలిచారు. ఆమె.. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన బందన కుమారిపై 29595 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే 2015, 2020 సంవత్సరాల్లో రేఖా గుప్తా ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
రేఖా గుప్తా 2009 నుంచి ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మార్చి 2010 నుండి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు కూడా. ఆమె నార్త్ పితంపుర (వార్డ్ 54) నుండి 2007, 2012లో రెండుసార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఆమె 2013 నుంచి నిరంతరం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తూ 2025లో గెలిచారు. 1992లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) ద్వారా రాజకీయ ప్రయాణం ప్రారంభించారు.
Also Read: Hydra: దళితవాడకు దారి దొరికింది.. దేవరయాంజల్‌లో ప్రహరీని తొలగించిన హైడ్రా!
షాలిమార్ బాగ్ నుంచి రేఖ గుప్తా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేఖ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో క్రియాశీల సభ్యురాలు. 1996-97 మధ్య ఆమె DUSU మాజీ ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలు. 2003-2004 వరకు ఆమె భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఢిల్లీ రాష్ట్ర కార్యదర్శి పదవిని నిర్వహించారు. 2004-2006లో బీజేపీ యువమోర్చా జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేశారు. 2007-2009- వరుసగా రెండు సంవత్సరాలు మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ, MCD చైర్‌పర్సన్ అయ్యారు. ముందుగా బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సీఎం పదవికి రేఖా గుప్తా, డిప్యూటీ సీఎం ప్రవేశ్ వర్మ పేర్లను ఖరారు చేశారు. అలాగే విజేంద్ర గుప్తాను అసెంబ్లీ స్పీకర్‌గా నియమించనున్నారు. గురువారం రాంలీలా మైదాన్‌లో రేఖా గుప్తా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొత్తం 48 మంది ఎమ్మెల్యేలతో పాటు కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధంఖర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఎంపీలను కూడా పిలిచారు.