Runa Mafi : రుణమాఫీ అమలుకావడంతో..రాజీనామా పై స్పందించిన హరీశ్ రావు
రుణమాఫీ అమలు కావడం తో హరీష్ రావు రాజీనామా చేయాల్సిందే అని..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అంటున్నారు
- Author : Sudheer
Date : 18-07-2024 - 6:41 IST
Published By : Hashtagu Telugu Desk
ఆగస్టు 15 లోగా ప్రభుత్వం రైతురుణమాఫీ (Runa Mafi) చేస్తే తాను MLA పదవికి రాజీనామా చేస్తానని హరీష్ (MLA Harish Rao) ఆమధ్య బహిరంగంగా ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రుణమాఫీ చెయ్యాలంటే 48 వేలకోట్లు కావాలి..ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర అంత లేవు..సో ఎట్టి పరిస్థితుల్లో రుణ మాఫీ చేయరనే ఉద్దేశ్యంతో ఆరోజు హరీష్ రావు సవాల్ చేసారు. కానీ రేవంత్ సర్కార్ చెప్పినట్లే ఇప్పుడు రుణమాఫీ చేసి తమపై నిలబెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈరోజు( గురువారం) తెలంగాణ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. లక్ష రూపాయల వరకు రుణాలను మాఫీ చేసినట్లు ప్రకటించారు. సుమారు పదకొండున్నర లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7వేల కోట్లు జమ చేసినట్లు వివరించారు. నిధులు విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు రైతువేదికల వద్ద సంబురాలు చేసుకుంటున్నారు. ఈ నెలాఖరుకు లక్షన్నర రూపాయలు, ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణాబకాయిలను రైతుల తరఫున ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించేలా ప్రణాళిక చేసింది.
ఇక ఇప్పుడు రుణమాఫీ అమలు కావడం తో హరీష్ రావు రాజీనామా చేయాల్సిందే అని..ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అంటున్నారు. ఈ క్రమంలో తన సవాల్ ఫై స్పందించారు. కాంగ్రెస్ 100రోజుల్లో అమలు చేస్తామని బాండు పేపర్ ఫై రాసిచ్చిన 13 హామీలతో పాటు రుణమాఫీని ఆగస్టు 15లోపు చేస్తేనే MLA పదవికి రాజీనామా చేస్తానని స్పష్టంగా చెప్పానని హరీశ్ రావు అన్నారు. కావాలంటే తాను మాట్లాడిన వీడియోను మరోసారి చూడాలని ఆయన కోరారు. తన మాటలకు కట్టుబడి ఉంటానని తెలిపారు.
Read Also : T20 Captain: గంభీర్ నిర్ణయంతో హార్దిక్ షాక్..?