HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Gambhir Going To Shock Hardik

T20 Captain: గంభీర్ నిర్ణయంతో హార్దిక్ షాక్..?

టీమిండియా త్వరలో టి20సిరీస్ కోసం శ్రీలంక వెళ్లనుంది.అయితే శ్రీలంక పర్యటనతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వాస్తవానికి తొలుత హార్దిక్ పాండ్యా పేరు ఫైనల్ అనుకున్నప్పటికీ పాండ్య ఫిట్‌నెస్

  • Author : Praveen Aluthuru Date : 18-07-2024 - 6:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hardik Pandya Future
Hardik Pandya Future

T20 Captain: టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో టి20 కెప్టెన్ పోస్ట్ ఖాళీ అయింది. తదుపరి టీ20 జట్టు కెప్టెన్ ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఇద్దరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పవర్ ఫుల్ బ్యాట్స్ మెన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. నివేదికల ప్రకారం ప్రధాన కోచ్ గంభీర్ మరియు రోహిత్ శర్మ ఇద్దరూ కూడా సూర్యకుమార్ యాదవ్ నే తదుపరి టి20 కెప్టెన్ చేయాలనీ భావిస్తున్నారు.

టీమిండియా త్వరలో టి20సిరీస్ కోసం శ్రీలంక వెళ్లనుంది.అయితే శ్రీలంక పర్యటనతో పాటు 2026 టీ20 ప్రపంచకప్ వరకు సూర్యకుమార్ యాదవ్ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు నివేదికలు చెప్తున్నాయి. వాస్తవానికి తొలుత హార్దిక్ పాండ్యా పేరు ఫైనల్ అనుకున్నప్పటికీ పాండ్య ఫిట్‌నెస్ గురించి పలువురు ఆందోళన చెందుతున్నారు. హార్దిక్ మాటిమాటికి గాయాల బారీన పడుతుండటంతో అతనిపై జట్టు బాధ్యత పెట్టడం సరైంది కాదని సెలక్షన్ కమిటీ అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా టి20 ఫార్మేట్ కు దీర్ఘకాల కెప్టెన్ గా సూర్యనే కరెక్ట్ అని అనుకుంటున్నారు.

సూర్యకుమార్ యాదవ్ గతంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లకు భారత్‌కు నాయకత్వం వహించాడు. దీంతోపాటు దేశవాళీ క్రికెట్‌, ఐపీఎల్‌కు కూడా కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు మొత్తం 7 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్య కెప్టెన్సీలో టీమ్ ఇండియా 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచింది, రెండిట్లో ఓటమిని చవిచూసింది. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. రంజీ ట్రోఫీలో 6 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అందులో ముంబై ఒక్క మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించింది. కాగా 2 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. కాగా 3 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ఇది కాకుండా దేశీయ టి20 క్రికెట్ అంటే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా సూర్యకుమార్ యాదవ్ ముంబైకి కెప్టెన్‌గా ఉన్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 మ్యాచ్‌లకు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. సూర్య కెప్టెన్సీలో ముంబై 16 మ్యాచ్‌లు ఆడగా 10 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.

ఐపీఎల్‌లో కూడా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. రెగ్యులర్ కెప్టెన్ కానప్పటికీ. ఐపీఎల్‌లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే ముంబై ఇండియన్స్‌కు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. సూర్యకుమార్ యాదవ్ 2021లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అప్పటి నుండి 68 మ్యాచ్‌లలో 43.33 సగటు మరియు 167.74 స్ట్రైక్ రేట్‌తో 2340 పరుగులు చేశాడు.

Also Read: Director Puri : డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఫై పోలీసులకు ఫిర్యాదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gambhir Hardik
  • srilanka
  • surya kumar yadav
  • T20 Captain

Related News

Team India players reach Ahmedabad

అహ్మదాబాద్‌లో అడుగుపెట్టిన సూర్య‌ సేన

India vs New Zealand  టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు ముందు భారత జట్టు అహ్మదాబాద్‌కు చేరుకుంది. ముంబైలో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరితమైన సెమీఫైనల్‌లో 7 పరుగుల తేడాతో గెలిచిన భారత జట్టు ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. మార్చి 8న నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిస్తే టీ20 వరల్డ్ కప్ చరిత్రలో వరుసగా రెండు టైటిళ్లు గెలిచిన తొలి జట్టుగ

  • Suryakumar Yadav, Gautam Gambhir

    ఇంగ్లండ్‌తో సెమీఫైన పై గంభీర్-సూర్య మైండ్ గేమ్..

Latest News

  • Durgapur Expressway : దేవుడా.. ప్రారంభించిన 6 నెలల్లోనే కుంగిన దుర్గాపూర్ ఎక్స్ ప్రెస్ హైవే !!

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd