Gutta Sukhender Reddy : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ?
- By Pasha Published Date - 12:50 PM, Tue - 12 March 24

Gutta Sukhender Reddy : తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పే జిల్లాల్లో నల్గొండ ఒకటి. అక్కడి నాయకులు రాష్ట్ర స్థాయి పాలిటిక్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. శాసన మండలి చైర్మన్, సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి నల్గొండ నుంచి లోక్‌సభకు ఎన్నికైన చక్కటి ట్రాక్ రికార్డు ఉంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం తన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు. తన కుమారుడికి మంచి రాజకీయ అవకాశం దొరికేలా చేయాలని తపిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
తన కుమారుడికి నల్గొండ లోక్‌సభ టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) కోరగా.. అందుకు నో చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో నిరాశకు గురైన సుఖేందర్ రెడ్డి త్వరలోనే తన కుమారుడు అమిత్ రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరుతారని సమాచారం. ఈక్రమంలో తాజాగా ఇవాళ ఉదయం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ అయ్యారు. కొద్ది రోజులుగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరుపుతున్న అమిత్ రెడ్డి.. ఇప్పుడు సీఎం రేవంత్‌కు సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం గమనార్హం. త్వరలోనే నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత అమిత్ రెడ్డి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్‌బై.. ఎందుకు ?
ఇటీవల హైదరాబాద్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా గుత్తా అమిత్ రెడ్డి కలిశారు. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరే అంశాన్ని మంత్రితో అమిత్ చర్చించినట్లు సమాచారం. భువనగిరి నుంచి పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కోమటిరెడ్డిని కోరారట. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న అమిత్‌కు నల్లగొండ ఎంపీగా పోటీ చేసే అవకాశం లేదు. ఇప్పటికే నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కుందూరు రఘువీర్ రెడ్డిని పార్టీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అమిత్‌కు భువనగిరి టికెట్ అంతా ఈజీ కాదట. భువనగిరి టికెట్‌ను సీఎం రేవంత్ సన్నిహితుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి, సూర్యాపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ ఆశిస్తున్నారు. దీనికి తోడు కోమటిరెడ్డి బ్రదర్స్ ఆశీస్సులు ఉన్న వారికే టికెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.