Mahesh Babu Guntur Karam : గుంటూరు కారం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్..!
Mahesh Babu Guntur Karam సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం ఈ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్
- By Ramesh Published Date - 12:50 PM, Tue - 12 March 24

Mahesh Babu Guntur Karam సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం ఈ సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించాడు. సినిమాలో ఆరు సాంగ్స్ ఇవ్వగా అవన్నీ కూడా ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో మరో సాంగ్ కూడా ఉందని.. అది సినిమాలో పెట్టలేదని తెలుస్తుంది. గుంటూరు కారం సినిమా నుంచి 7వ సాంగ్ త్వరలో రిలీజ్ అవబోతుందని మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ అయ్యాక ఈ ట్విస్ట్ ఏంటని ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అవుతున్నారు.
గుంటూరు కారం సినిమాలో మరో సాంగ్ అనగానే సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో సూపర్ ఎగ్జైట్ మెంట్ మొదలైంది. ఇంతకీ అది మహేష్ సోలో సాంగ్ గా వస్తుందా లేదా శ్రీలాలతో కలిసి స్టెప్పులు వేశాడా లేదా మీనాక్షి తో ఏమన్నా సాంగ్ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది. గుంటూరు కారం సినిమాలో మహేష్ డ్యాన్స్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. తనలోని డ్యాన్సింగ్ టాలెంట్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు మహేష్.
Also Read : Chiranjeevi : విశ్వంభర తర్వాత చిరు ఎవరితో అంటే..!