HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Good News From The Centre For Rail Passengers In The Telugu States

తెలుగు రాష్ట్రాల రైలు ప్రయాణీకులకు కేంద్రం గుడ్‌న్యూస్

  • Author : Vamsi Chowdary Korata Date : 14-03-2026 - 10:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telugu States IRCTC Special Trains
Telugu States IRCTC Special Trains

Telugu States IRCTC Special Trains  తెలుగు రాష్ట్రాల ప్రయాణికుల సౌకర్యార్థం మూడు ప్రత్యేక రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. హైదరాబాద్-కన్యాకుమారి, కాచిగూడ-ట్యూటికోరిన్, చర్లపల్లి-షాలిమార్ ట్రైన్లు ఇకపై శాశ్వత ప్రాతిపదికన నడవనున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం తగ్గడంతో పాటు అదనపు ఛార్జీల భారం తప్పుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు తీపి కబురు. ప్రత్యేక సర్వీసులుగా నడుస్తున్న మూడు రైళ్లను రైల్వే బోర్డు రెగ్యులర్‌గా మార్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల ట్రైన్ ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. హైదరాబాద్‌-కన్యాకుమారి, చర్లపల్లి-షాలిమార్‌, కాచిగూడ-ట్యూటికోరిన్ మార్గాల్లో రాకపోకలు సాగించేవారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. రెగ్యులర్‌ ట్రైన్లుగా మార్చడం వల్ల ప్రయాణ సమయం తగ్గుతుందన్నారు. అదనపు ఛార్జీలూ ఉండవని అన్నారు.

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. 2014 నుంచి హైదరాబాద్‌ రైల్వే స్టేషన్ల కేంద్రంగా భారతీయ రైల్వే 91 కొత్త ట్రైన్ సర్వీసులను ప్రారంభించిందని తెలిపారు. రూ.36,286 కోట్ల రైల్వే బడ్జెట్‌ను కేటాయించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో రూ.47,984 కోట్ల రైల్వే పనులు జరుగుతున్నాయని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేనివిధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రానికే మూడు హైస్పీడ్‌ ట్రైన్ కారిడార్లను మంజూరు చేశారని వివరించారు.

హైదరాబాద్‌-కన్యాకుమారి-హైదరాబాద్‌ ప్రత్యేక ట్రైన్‌ను హైదరాబాద్‌-కన్యాకుమారి-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చారు. గతంలోలాగే ఈ ట్రైన్ ప్రతి బుధవారం సాయంత్రం 5.20 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తమిళనాడులోని కన్యాకుమారి చేరుకుంటుందని చెప్పారు. సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు స్టేషన్ల మీదుగా ప్రయాణం సాగిస్తుంది.

కాచిగూడ-మదురై-కాచిగూడ ప్రత్యేక ట్రైన్‌ను కాచిగూడ-ట్యూటికోరిన్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌గా మార్చేశారు. ప్రతి సోమవారం మధ్యాహ్నం మూడింటికి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మొదలై మరుసటి రోజు రాత్రి 10.45 గంటలకు కేరళలోని ట్యూటికోరిన్‌కు చేరుకుంటుంది. షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.

చర్లపల్లి-షాలిమార్‌-చర్లపల్లి ప్రత్యేక ట్రైన్‌ను చర్లపల్లి-షాలిమార్‌-చర్లపల్లి అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్ ప్రతి మంగళవారం ఉదయం 7.15 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి బుధవారం ఉదయం 11.20 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని షాలిమార్‌కు చేరుకుంటుందని చెప్పారు. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా ఈ ట్రైన్ ప్రయాణం సాగిస్తుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • indian railways
  • IRCTC Special Trains
  • Railway Special Trains
  • special trains
  • telangana
  • telugu states
  • Union Minister G. Kishan Reddy

Related News

Lv Prasad Eye Hospital

LV Prasad Eye Hospital : ఏపీలో కొత్తగా ఎల్వీ ప్రసాద్ కంటి హాస్పటల్..ఎక్కడంటే !

ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తాడిగడపలో ప్రధాన కేంద్రం ఉండగా, ఇప్పుడు గుడ్లవల్లేరులో రెండో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గతంలో కౌతవరంలో నిర్మించాలని భావించినా కొన్ని కారణాల వల్ల అది వీలుపడలేదు

  • Ap 10th Exam Results

    AP 10th Results : ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల..అమ్మాయిలదే పైచేయి !!

  • Ashu Reddy

    Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

  • KTR clarifies on organizations formed in his name

    BRS @ 25 Years : కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం – కేటీఆర్ ధీమా

  • Petrol Bunks Rush

    Free Petrol : తిరుపతిలో ఫ్రీగా పెట్రోల్.. క్యూ కడుతున్న వాహనదారులు

Latest News

  • Mahanadu 2026 : టీడీపీ మహానాడు వేదిక మార్పు? కారణం అదేనా ?

  • Illegal Affair : కలచివేస్తున్న టెక్కీ సూసైడ్ నోట్.. ‘ఆమె కోరుకునేది శృంగారమేనా?’

  • VH : వీహెచ్‌కు కీలక పదవి కట్టబెట్టిన సీఎం రేవంత్

  • TRS : కవిత పార్టీకి ఈసీ గ్రీన్‌సిగ్నల్‌..కాకపోతే !!

  • KTR : కేటీఆర్ చెంప చెల్లుమనిపించాడు

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd