LRS Scheme : గత నాలుగేళ్లలో ప్లాట్లు కొన్న వాళ్లకూ ఆ అవకాశం
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ క్రమబద్ధీకరణ పథకం(LRS Scheme) అమలులో వేగాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
- By Pasha Published Date - 08:25 PM, Wed - 19 February 25

LRS Scheme : సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న భూ క్రమబద్ధీకరణ పథకం(LRS Scheme) అమలులో వేగాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం అమలు ప్రగతిపై ఇవాళ (బుధవారం) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. గత నాలుగేళ్ల వ్యవధిలో ప్లాట్లు కొన్న వారికి కూడా ఎల్‌ఆర్ఎస్ స్కీం ద్వారా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. 10 శాతం ప్లాట్లు రిజిస్టర్ అయిన లేఅవుట్లలోని మిగిలిన ప్లాట్లను కూడా క్రమబద్ధీకరణ చేసుకోవచ్చన్నారు.
Also Read :Telangana Premier League : తెలంగాణ ప్రీమియర్ లీగ్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ సహకారం
క్రమబద్ధీకరణ ఫీజును మార్చి 31వ తేదీ వరకు చెల్లిస్తే 25శాతం రాయితీని అందిస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించిన చెల్లింపులను సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల వద్దే చేసి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుదిల్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, పురపాలక, పట్టణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ బుద్ధ ప్రకాష్ జ్యోతి, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read :LRS Scheme : గత నాలుగేళ్లలో ప్లాట్లు కొన్న వాళ్లకూ ఆ అవకాశం
క్రమబద్ధీకరణ రుసుములు ఇలా..
- 2020 సెప్టెంబరు 16న ఎల్‌ఆర్‌ఎస్ పథకానికి సంబంధించి అనధికారిక లేఅవుట్ల క్రమబద్ధీకరణ రుసుములపై తెలంగాణ సర్కారు జీవో నంబరు 135ను జారీ చేసింది. ఈ రుసుము ఆయా ప్రాంతాల్లో ఉండే మార్కెట్ విలువలు, భూ విస్తీర్ణం ఆధారంగా మారిపోతుంది.
- ఎల్‌ఆర్‌ఎస్ రుసుము అనేది గజం ధర రూ.3వేల నుంచి రూ.5 వేల వరకు ఉంటే 30 శాతం, రూ.5-10 వేల మధ్య ఉంటే 40 శాతం, రూ.10-20 వేల మధ్య ఉంటే 50 శాతం, రూ.20-30 వేల మధ్య ఉంటే 60 శాతం, రూ.30-50 వేల మధ్య ఉంటే 80 శాతం, రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే 100 శాతం చొప్పున చెల్లించాలి.
- అనుమతి లేని లేఅవుట్‌లో 10 శాతం ఖాళీ స్థలం లేకపోయినా, నేరుగా భవనాల అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంటే ఎల్‌ఆర్‌ఎస్ రుసుముతోపాటు 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీ, అదనంగా కాంపౌండ్ పెనాల్టీని తీసుకుంటారు. ఎల్‌ఆర్‌ఎస్ చేయించుకుంటే కాంపౌండ్ పెనాల్టీ పడదు.
- జీవో నంబరు 131లో 100 చదరపు మీటర్ల విస్తీర్ణానికి చదరపు మీటరుకు రూ.200 కనీస క్రమబద్ధీకరణ రుసుము చెల్లించాలి. ఆ తర్వాత చదరపు మీటరును బట్టి రుసుము మారుతుంటుంది.