Gold Price Today : రికార్డు స్థాయిలో బంగారం ధరలు..
Gold Price Today : బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ధరల షాక్ తగులుతోంది. వరుసగా రెండో రోజూ భారీగా పెరిగాయి. దీంతో తులం బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరుకుంది. రెండ్రోజుల్లోనే దాదాపూ రూ.2200 పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.86 వేలు దాటింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 6వ తేదీన బంగారం, వెండి రేట్లు తెలుసుకుందాం.
- Author : Kavya Krishna
Date : 06-02-2025 - 9:16 IST
Published By : Hashtagu Telugu Desk
Gold Price Today : భారతీయ సంప్రదాయంలో విలువైన లోహంగా పేరుగాంచిన బంగారం, ధరల పెరుగుదలతో సాధారణ ప్రజలకు అందని ద్రాక్షగా మారుతోంది. రోజుకో మలుపు తిరుగుతున్న బంగారం ధరలతో కొనుగోలుదారులు, ముఖ్యంగా మహిళలు ఆందోళన చెందుతున్నారు. నిన్నటి ధర ఈరోజు ఉండడం లేదు, ఈరోజు రేటు రేపటికి మారిపోతోంది. నెల రోజుల వ్యవధిలోనే తులం బంగారం రూ.78 వేల నుంచి రూ.86 వేల దాటింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.2200 మేర పెరుగుదల నమోదైంది. బులియన్ మార్కెట్ నిపుణుల మాటల్లో, భవిష్యత్తులో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశముంది.
Phone Tapping Case : హరీష్ రావుకు హైకోర్టులో ఊరట..
మఅంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు రికార్డు స్థాయిలో కొనసాగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గినప్పటికీ, ఫిబ్రవరి 6 నాటికి స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $2867 వద్ద ట్రేడవుతోంది. వెండి ధర ఒక ఔన్సుకు $32.41 వద్ద ఉంది. మరోవైపు రూపాయి విలువ మరింతగా పడిపోయింది. ప్రస్తుతం ₹87.438 వద్ద రూపాయి మారకపు విలువ ఉంది.
హైదరాబాద్‌లో బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
24 క్యారెట్ల బంగారం: రూ. 86,240 (రూ.1040 పెరిగింది)
22 క్యారెట్ల బంగారం: రూ. 79,050 (రూ.950 పెరిగింది)
వెండి ధరల పెరుగుదల
గతరోజు కాస్త తగ్గిన వెండి ధర మళ్లీ ఒక్కరోజులోనే రూ.1000 పెరిగింది. ఫిబ్రవరి 6 నాటికి కిలో వెండి రేటు రూ. 1,07,000 వద్ద ట్రేడవుతోంది.
గమనిక: ఈ ధరలు ఫిబ్రవరి 6 ఉదయం 7 గంటలకు నమోదైనవి. మధ్యాహ్నానికి మార్కెట్ పరిస్థితుల ఆధారంగా రేట్లు మారవచ్చు. అలాగే, జీఎస్టీ, ఇతర పన్నుల ఆధారంగా ప్రాంతాన్ని బట్టి ధరల్లో తేడా ఉండొచ్చు. అందువల్ల బంగారం, వెండి కొనుగోలు చేసేముందు స్థానికంగా ఉన్న తాజా రేట్లు తెలుసుకోవడం ఉత్తమం.
Gopichand : గోపీచంద్ పవర్ కంబ్యాక్ కోసం అభిమానుల ఎదురుచూపులు